నాపేరు శివకు సీక్వెల్

తమిళ హీరో కార్తీని తెలుగు వారికి దగ్గర చేసిన సినిమాల్లో నా పేరు కార్తీ ఒకటి. ఇప్పుడు ఆ సినిమా కు సీక్వెల్ తయారవుతోంది. సాధారణంగా సీక్వెల్ అంటే అదే హీరో, హీరోయిన్లు వుంటారు. కానీ ఈ సీక్వెల్ లో కార్తీ చేయడం లేదు. తెలుగు హీరో సందీప్ కిషన్ చేస్తున్నారు. సందీప్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో తయారయ్యే ఈ సినిమాకు నాపేరు శివ కు పని చేసిన టెక్నికల్ టీమ్ నే పనిచేస్తుంది. 

సుశీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సీక్వెల్ గా మాంచి కథను తయారు చేసారట. అయితే లవ్ అండ్ రివెంజ్ ఫార్ములాతో తయారైన సినిమాకు సీక్వెల్ ఎలా సెట్ చేస్తారో? పైగా హీరో హీరోయిన్లు మారిపోయాక సీక్వెల్ ఎలా జస్టిఫై అవుతుందో చూడాలి. ప్రస్తుతం నక్షత్రం షూట్ లో బిజీగా వున్న సందీప్ ఆ సినిమా పూర్తి కాగానే ఈ సినిమా ప్రారంభిస్తారు. తమిళ వెర్షన్ లో కూడా సందీప్ నే హీరో కావడం విశేషం.

ఈవారం విడుదలైన నగరం కూడా తెలుగు తమిళ భాషల్లో రూపొందింది. అలాగే మరో రెండు తమిళ సినిమాల్లో కూడా సందీప్ నటిస్తున్నాడు. మొత్తానికి తెలుగు కన్నా తమిళ రంగం సందీప్ కిషన్ కు కలసి వస్తున్నట్లుంది.

Show comments