చంద్రనీతి : అమ్మకు అన్నం పెట్టడుగానీ..

అమ్మకు అన్నం పెట్టడు గానీ.. పిన్నికి పరమాన్నం పెడతానన్నాడని మన పల్లెటూళ్లలో  ఓ ముతక సామెత ఉంది. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న వ్యవహార సరళిని గమనిస్తే ఆ సామెతే గుర్తుకు వస్తోంది. కేంద్రం ఆల్రెడీ ప్రకటించిన ప్యాకేజీలో సొమ్ములను వేగిరం తీసుకువచ్చి.. పోలవరం ప్రాజెక్టు పనులను త్వరితగతిన నడిపించడానికి గతిలేదు గానీ.. తెలంగాణలో ఓ ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలని చంద్రబాబునాయుడు తమ పార్టీ నేతలను పురమాయించడం అనేది పెద్ద కామెడీగా కనిపిస్తోంది. 

తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అస్తిత్వం నిలబెట్టుకోవడానికి నానా పాట్లు పడుతున్న సంగతి అందరికీ తెలుసు. అలాంటి  ప్రయత్నాల్లోనే ఉన్న మరొక పార్టీ కాంగ్రెస్ వాల్లు రిబ్బను కత్తిరించేసి వదిలేసిన ఉద్యమాలు అన్నిటినీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ భుజాన వేసుకుని మోస్తున్నది. తెరాస దూకుడును, హవాను ఎదుర్కోవడం ఎలాగో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్న తెదేపా శ్రేణులు కాంగ్రెస్ ప్రారంభించిన ఉద్యమాలనే కొనసాగించుకుంటూ.. తెరాసను తిట్ఠడంతో బతుకు సాగిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకువచ్చేద్దాం అని చంద్రబాబు పార్టీ వారితో చెప్పారుట. 

అయినా.. కాళేశ్వరానికి జాతీయ హోదా కావాలని తెరాస కొన్నేళ్ల బట్టీ డిమాండ్ చేస్తోంది. భాజపా  కూడా ఇటీవలి కాలంలో ఈ డిమాండ్ తో గళం కలుపుతోంది. భాజపా కేంద్రమంత్రి దత్తాత్రేయ కాళేశ్వరానికి జాతీయ హోదా తీసుకురావడానికి తాను కృషి చేస్తానూంట బహిరంగ సభలో ప్రకటించారు కూడా! ఇంత జరుగుతోంటే ఇప్పుడు తమ పార్టీ తరఫున కూడా ప్రత్యేకహోదా అనే పాట పాడినంత మాత్రాన తమ పార్టీకి మైలేజీ ఎలా దక్కుతుంది... అని వారు ప్రశ్నిస్తున్నారు. 

పైగా కేంద్రం పోలవరాన్ని జాతీయ హోదాగా ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా.. దానికి సక్రమంగా నిదులు తీసుకురావడానికే చంద్రబాబుకు సత్తా లేదు గానీ.. తెలంగాణలో ప్రాజెక్టుకు హోదా తాము తీసుకువస్తాం అంటే జనం నమ్ముతారా అనేది వారి ప్రశ్న. ఆల్రెడీ అన్నా పార్టీలు చేస్తున్న డిమాండ్‌నే తాము  కూడా వినిపించడం ద్వారా పార్టీకి మైలేజీ రాదని.. జనానికి ఉపయోగం ఉండేలా ఏదైనా కొత్తగా చేయాలని అయితే, తెలంగాణ పార్టీ కోసం సమయం వెచ్చించి అంతో ఇంతో పార్టీకి మేలు జరిగేలా దిశానిర్దేశం చేయగల సత్తా చంద్రబాబునాయుడుకు ఉండడం లేదని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

Show comments