జగన్… ప్రొఫెషనల్ గోల్ఫ్ ప్లేయర్ రేంజ్ లో..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అభిరుచులు చాలా రిచ్ గానే ఉన్నట్టున్నాయి. విదేశీ పర్యటనలో జగన్ ఆసక్తులు బయటపడుతున్నాయి.తాజాగా కుటుంబంతో కలిసి బ్రిటన్ పర్యటనకు వెళ్లిన జగన్ మోహన్ రెడ్డికి సంబంధించి కొన్ని ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. 

వాటిల్లో బ్రిటన్ లోని జగన్ అభిమానులు తీసుకున్న సెల్ఫీలతో పాటు మరికొన్ని ఫొటోలు కూడా ఉన్నాయి. అందులో జగన్ గోల్ఫ్ ఆడుతున్న ఫొటోలున్నాయి. వీటిలో ప్రొఫెషన్ గోల్ఫ్ ప్లేయర్ తరహాలో కనిపిస్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి. అభిమానులను ఈ ఫొటోలు అమితంగా అలరిస్తాయని వేరే చెప్పనక్కర్లేదు. 

Show comments