విదేశాలకు వెళ్లి డీ టాక్సీనేషన్ ట్రీట్ మెంట్ తీసుకుని, రెండు కిలోల వెయిట్ కూడా తగ్గిన సూపర్ స్టార్ మహేష్ బాబు మళ్లీ ఇండియా వచ్చేసారు. ముంబాయ్ లో జరుగుతున్న సంభవామి షూట్ కు రెడీ అయిపోయారు. ఈ సినిమాకు సంబంధించి హీరో ఇంట్రడక్షన్ సీన్లు చిత్రీకరించడం ప్రారంభించారట దర్శకుడు మురుగదాస్. ఈ సీన్లు రెండు మూడు రోజుల పాటు వుంటాయి. అవి అయిన తరువాత మిగిలిన సీన్లపైకి వెళ్తారు. ముంబాయి తరువాత అహమ్మదాబాద్, డయ్యూ డామన్ తదితర లోకేషన్లలో కూడా షూట్ వుంటుంది.
ఇదిలా వుంటే ఇప్పటికీ సంభవామి షూటింగ్ అనుకున్నదానికన్నా కాస్త బిహైండ్ ది షెడ్యూలు లో వుంది. అందుకే ఇక వీలయినంత వరకు హాలీడేలు, గ్యాప్ లు లేకుండా షూట్ కంటిన్యూ చేయాలని ఇటు డైరక్టర్ మురుగదాస్, అటు హీరో మహేష్ బాబు డిసైడ్ అయ్యారట. ఎలాగైనా మార్చి నెలాఖరుకు టాకీ మొత్తం ఫినిష్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.