అదుర్స్-2 అని చెప్పకనే చెప్పారుగా

అల్లు అర్జున్-హరీష్ శంకర్-దిల్ రాజు కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా దువ్వాడ జగన్నాధమ్..అలియాస్ డిజె. ఈ సినిమా ఫస్ట్ లుక్ మరో రెండు రోజుల్లో వస్తుంది. అయితే ఈ ఫస్ట్ లుక్ వస్తూదంటూ ఓ ప్రీ లుక్ వదిలారు. నల్లటి తాడుకు కట్టిన రుద్రాక్ష, విబూది నామాలు, కుంకుమ బొట్టు...ఇదీ ప్రీలుక్.

విషయం ఏమిటంటే, డిజె సినిమాలో బన్నీ బ్రాహ్మిన్ బాయ్ క్యారెక్టర్ వేస్తున్నాడని, అదుర్స్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ స్ఫూర్తిగా, అదుర్స్ 2 అనిపించేలా ఈ స్క్రిప్ట్ ను హరీష్ శంకర్ తయారుచేసాడని ముందే వెల్లడించాం. ఇప్పుడు ఈ ప్రీలుక్  ఆ విషయాన్ని క్లియర్ గా కన్ ఫామ్ చేసేసింది.

నిజానికి హరీష్ ఈ స్క్రిప్ట్ ను అదుర్స్ 2 అనే తయారు చేసాడు. ఎన్టీఆర్ కు అప్పట్లోనే చెప్పాడు కూడా. అయితే చాలా కారణాల వల్ల అక్కడ అది మెటీరియలైజ్ కాలేదు. ఆఖరికి బన్నీ దగ్గరకు వచ్చింది. బన్నీ, అరవింద్ గారు చెప్పిన అనేకానేక మార్పులు, చేర్పులు తరువాత అదుర్స్ 2 కాస్తా డిజె గా మారి ఈ పోస్ట్ సమ్మర్ రిలీజ్ కోసం రెడీ అయిపోతోంది.

Readmore!
Show comments

Related Stories :