ఫుల్ పేజీ పవన్ కల్యాణ్.. పావు పేజీలో పట్టాడు!

ఆ మధ్య కాకినాడలో సభ జరిగితే.. జనసేన అధినేతకు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డెయిలీలో ఫుల్ పేజీ ప్రాధాన్యత దక్కింది! ఆ సభలో పవన్ మాట్లాడుతుండగా.. తీసిన ఫొటోను నిలువెత్తు కటౌట్ గా పెట్టి.. బ్రహ్మాండమైన రీతిలో జరిగింది ప్రజెంటేషన్. దాని కన్నా ముందు జరిగిన తిరుపతి సభను అయితే పతాక శీర్షికలో ప్రజెంట్ చేశారు. మొదటి పేజీలో హాఫ్ పేజీ.. ఆ తర్వాత లోపల మరో ఫుల్ పేజీ!

కానీ.. అనంతపురం లో జరిగిన జనసేన అధినేత సభకు తెలుగుదేశం, బీజేపీ అనుకూలంగా పనిచేస్తున్న మెజారిటీ మీడియా పూర్తిగా ప్రాధాన్యతను తగ్గించి వేయడాన్ని గమనింవచ్చు. ఏపీ ఎడిషన్లను పరిశీలించినా, టీవీ చానళ్లలో ప్రసారాన్ని గమనించినా.. ఈ విషయం ప్రస్ఫుటం అవుతోంది.

పవన్ సభను లైవ్ గా చూపిన చానళ్లు.. ఆ తర్వాత మళ్లీ పవన్ ప్రసంగాన్ని రిపిటేషన్ కు అంతగా ఇష్టపడలేదు. పవన్ సభ ముగుస్తుండగానే.. చినబాబు లోకేష్ లైవ్ లోకి వచ్చారు ఆ చానళ్లంటిలోనూ.

 సిద్ధార్థ కాలేజీలో చినబాబు ముచ్చట్లను ప్రసారం చేశారు.. ఆ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మళ్లీ అవే వార్తలే వచ్చాయి కానీ, పవన్ ప్రసంగంలోని ‘పంచ్’ లను వినిపించనీయలేదు! ‘పవర్ పంచ్’ అంటూ సాగే పునఃప్రసారాలేవీ జరగలేదు.

ఇక పత్రికల విషయానికి వస్తే.. ఫుల్ పేజీ పవన్ కల్యాణ్ ను త్రీసీ కాలమ్ స్థాయికి తీసుకొచ్చారు! ఫస్ట్ పేజీలో డబుల్ కాలమ్ ఇండికేటర్ పెట్టారు లోపలకు వెళితే తొలి రెండు సభలకు ఇచ్చిన ప్రాధాన్యతలో కనీసం పావు స్థాయి ప్రాధాన్యత కూడా దక్కలేదు!

వాస్తవానికి అనంతపురం సభలో పవన్ కల్యాణ్.. తెలుగుదేశం, బీజేపీలపై డైరెక్టు అటాక్ చేయలేదు. ‘ఒక కులం’ అని మాత్రమే మాట్లాడాడు. వెంకయ్యకు జరుగున్న సన్మానాలను ప్రస్తావించాడు! ఒకవేళ పవన్ గనుక జగన్ ను ఏదైనా అని ఉంటే.. యథాతథంగా మళ్లీ పవర్ పంచ్.. పతాక స్థాయి వార్తలు ఉండేవి! కానీ.. పవన్ స్ట్రాటజీలో మార్పు కనిపిస్తోంది. ‘ఒక కులం’ అంటూ కాపులను దగ్గర చేసుకునేయత్నం చేస్తున్నట్టున్నాడు పవన్. దీంతోనే.. తెలుగుదేశం అనుకూల మీడియా హఠాత్తుగా పవన్ కు ప్రాధాన్యతను తగ్గించి వేసింది!

మరి ఇంతలోనే అంతమార్పు! ఒకవేళ.. నిజంగానే పవన్ చంద్రబాబు , బీజేపీ ప్రభుత్వాల మీద విమర్శలు చేస్తే.. అప్పుడు పవర్ స్టార్ ప్రాధాన్యత సింగిల్ కాలమ్ స్థాయికి వస్తుందనడంలో సందేహం లేదు.  

Show comments