వెబ్ సిరీస్ లో నటించబోతున్న బాలయ్య బ్యూటీ

తన బోల్డ్ అండ్ హాట్ స్టేట్ మెంట్స్ తో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది రాధికా ఆప్టే. ప్రస్తుతం రెండు ఇంగ్లిష్ సినిమాలు, మరో 2 హిందీ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ త్వరలోనే ఓ వెబ్ సిరీస్ లో నటించనుంది. కోలీవుడ్, బాలీవుడ్ నుంచి వరుసగా అవకాశాలు వస్తున్న ఈ తరుణంలో వెబ్ సిరీస్ కు ఓకే చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది రాధికా.

అయితే ఇది మామూలు వెబ్ సిరీస్ మాత్రం కాదు. ఏకంగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్న సిరీస్ ఇది. విక్రమ్ చంద్ర రాసిన సూపర్ హిట్ నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రాబోతోంది. దీనికి "సేక్రెడ్ గేమ్స్" అని పేరు కూడా పెట్టారు. అలా విక్రమ్ చంద్ర రాసిన నవల పేరుతోనే ఇది రాబోతోంది.

మరో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి కూడా ఈ వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడు.  సిరీస్ కు సంబంధించి ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైంది. కాకపోతే రాధిక మాత్రం ఇంకా జాయిన్ అవ్వలేదు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్, రాధిక కలిసి ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు. 

Show comments