10 కోట్లేనా మరీ చీప్‌గా.!

బాలీవుడ్‌ ఐటమ్‌ బాంబ్‌ మలైకా అరోరా ఖాన్‌, తన భర్త అర్భాజ్‌ ఖాన్‌ నుంచి విడిపోనున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ ఇద్దరూ విడిగా వుంటున్నారు. విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఈ జంట. మరోపక్క, విడాకుల కోసం మలైకా అరోరా ఖాన్‌ ఏకంగా 10 కోట్ల రూపాయలు డిమాండ్‌ చేస్తోందన్న గాసిప్‌ తెరపైకొచ్చింది. న్యాయస్థానం విడాకులు మంజూరు చేయాలంటే, అందుకు ఇరువురి సమ్మతి అవసరం. అదే సమయంలో, తెరవెనుక సెటిల్‌మెంట్‌లు అందరికీ తెల్సిన విషయమే. 

ఇప్పటిదాకా బాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన డివోర్స్‌ జంటగా అంటే హృతిక్‌ - సుజానే రికార్డులకెక్కారు. 10 కోట్ల దాకా 'డీల్‌' సెట్‌ అయిన తర్వాతే వీరిద్దరూ విడిపోయారన్నది బాలీవుడ్‌లో అప్పట్లో హల్‌చల్‌ చేసిన వార్త. ఆ రికార్డుని బ్రేక్‌ చేసి 10 నుంచి 15 కోట్ల మధ్యలో డివోర్స్‌ సెటిల్‌మెంట్‌ దిశగా మలైకా - అర్భాజ్‌ అడుగులేస్తున్నారన్నది తాజా ఖబర్‌. 

అయితే, ఈ గాసిప్స్‌పై మలైకా అరోరా ఖాన్‌ స్పందించింది. '10 కోట్లు మరీ చీప్‌గా లేదూ.. 15 కోట్లు అయినా తక్కువే.. అయినా ఇలాంటి గాసిప్స్‌ ఎలా పుట్టుకొస్తాయ్‌.?' అంటూ అసహనం వ్యక్తం చేసింది. 'డబ్బు మేటర్‌ కాదిక్కడ.. మేం విడిపోదామనుకున్నాం, విడిపోతున్నాం.. అఫ్‌కోర్స్‌ మానసికంగా ఇప్పటికే విడిపోయాం.. చట్టబద్ధంగా విడిపోవడమే లేటు..' అంటూ మలైకా అరోరా వ్యాఖ్యానించింది. 

ఎలాంటి సెటిల్‌మెంట్‌ లేకుండానే విడిపోతున్నారా.? అన్న ప్రశ్నకు మాత్రం 'నో కామెంట్‌' అనేసింది. పెళ్ళయ్యాక ఐటమ్‌ బాంబ్‌గా చెలరేగిపోయిన మలైకా, అటు కుటుంబాన్నీ, ఇటు సినిమా కెరీర్‌నీ, ఇంకోపక్క సినీ నిర్మాణాన్నీ, ఇతరత్రా వ్యాపారాల్నీ నిర్వహిస్తూ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ లేడీ.. అన్పించుకుంది. ఏమయ్యిందో, పెళ్ళయిన చాలాకాలం తర్వాత అర్భాజ్‌తో విడిపోవాలనుకుంది. అఫ్‌కోర్స్‌.. విడిపోవడం అన్నది ఇద్దరి మ్యూచువల్‌ అండర్‌స్టాండింగ్‌ అనుకోండి.. అది వేరే విషయం. Readmore!

Show comments