బాలయ్యకు సమరసింహా సెంటిమెంట్

సమరసింహా రెడ్డి సినిమా నందమూరి బాలకృష్ణకు మాంచి టర్నింగ్ పాయింట్. టాలీవుడ్ లో ఫాక్షనిస్ట్ సినిమాలకు ఆజ్యం పోసిందా సినిమా. ఇప్పుడు అదే సినిమా సెంటిమెంట్ ను పూరి-బాలకృష్ణ సినిమాలో రిపీట్ చేస్తున్నారట. అది ఏ విధంగా అంటే, సమరసింహా రెడ్డి సినిమాలో బాలయ్య టాక్సీ డ్రయివర్ గా కనిపిస్తాడు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలాగే కనిపిస్తాడని తెలుస్తోంది. అయితే ఆ సినిమాలో ఆంధ్రలో టాక్సీ డ్రయివర్. ఈ సినిమాలో విదేశాల్లో క్యాబ్ డ్రయివర్. 

వాస్తవానికి పూరి చెప్పిన కథ మరేదో కాదని, ఆటోజానీ కథనే కాస్త చేంజెస్ చేసి బాలయ్యకు చెప్పారని తెలుస్తోంది. అయితే ఆటో డ్రయివర్ అంటే తన మాస్ అప్పీల్ కు అంతగా సూట్ కాదని, పైగా సమరసింహా రెడ్డి సెంటిమెంట్ వుండనే వుందని టాక్సీ డ్రయివర్ గా మార్చమని బాలయ్యే స్వయంగా సూచించినట్లు తెలుస్తోంది. అంటే ఈ లెక్కన ఫస్ట్ హాఫ్ టాక్సీ డ్రయివర్, ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఫ్లాష్ బ్యాక్ రివీల్, సెకండాఫ్ లో మరో గెటప్ ఇలా గతకాలపు ఫ్యాక్షనిస్టుల ఫార్ములా లో వుంటుందో? ఏంటో?

Show comments