'కత్తి'లాంటి పోరీకి పెద్ద షాక్‌

తెలుగులో 'కత్తి' సినిమాలో నటించిన సనాఖాన్‌, బాలీవుడ్‌లో 'వజా తుమ్‌ హో' సినిమాలో ఛాన్స్‌ రాగానే ఎగిరి గంతేసింది. అంతకు ముందు ఒకటీ అరా సినిమాల్లో నటించినా, 'వజా తుమ్‌ హో' సినిమాపై ఆమె పెట్టుకున్న ఆశలు అన్నీ ఇన్నీ కావు. 'ఇక, ఈ సినిమాతో నా కెరీర్‌ కీలక మలుపు తిరగడం ఖాయం.. తేడా కొడితే అంతే సంగతులు..' అంటూ సినిమాపై తాను ఎన్ని ఆశలు పెట్టుకున్నదీ చెబుతూ ఓ ఇంటర్వ్యూలో నోరు జారేసింది సనాఖాన్‌. 

అందుకేనేమో, మునుపెన్నడూ లేని స్థాయిలో సనా ఖాన్‌ 'వజా తుమ్‌ హో' సినిమాలో రెచ్చిపోయి అందాల ఆరబోసేసింది. ఇంతా చేస్తే, సినిమా ఆమెకు ఏం పేరు తెచ్చిపెట్టిందట.? ప్చ్‌, నిరాశే మిగిల్చింది. కెరీర్‌లో సక్సెస్‌, ఫెయిల్యూర్‌ మామూలేగానీ, ఒక్క గ్లామర్‌ విషయంలో తప్ప, సనా ఖాన్‌ నటన గురించి రివ్యూల్లో ఎవరూ పెద్దగా మెన్షన్‌ చేయకపోవడం గమనార్హం. అత్యంత జుగుప్సాకరం.. అనే స్థాయికి వెళ్ళి మరీ ఈ సినిమా కోసం ఎక్స్‌పోజింగ్‌ చేసేసినా, సనాఖాన్‌కి ఈ రెస్పాన్స్‌ రావడం నిజంగానే పెద్ద షాక్‌. 

ఇక, సినిమా గురించి షరామామూలుగానే సనాఖాన్‌ చాలా చాలా గొప్పగా చెప్పేస్తోంది. తన గ్లామర్‌ ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్‌ తెచ్చిపెట్టిందని అందరూ చెబుతోంటే చాలా ఆనందంగా వుందని ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఏం చేస్తాం, అలా సంతృప్తి పడాల్సిందే.. తప్పదు మరి.!

Show comments