వసూళ్లలో బాలయ్య పై చిరు పూర్తి ఆధిపత్యం!

సంక్రాంతికి పోటాపోటీగా విడుదల అయిన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణల సినిమాలు ఓవర్సీస్ లో సాధిస్తున్న వసూళ్లను పోల్చి చూస్తే మెగాస్టార్ ది పూర్తి ఆధిపత్యంగా కనిపిస్తోంది. ఈ సినిమాల తొలి రెండు రోజుల వసూళ్ల మార్కును పరిశీలించి చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. 

ట్రేడ్ పండిత్ తరణ్ ఆదర్శ్ ఇస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవి సినిమా తొలి రెండు రోజుల్లో 9.74 కోట్ల రూపాయలను వసూలు చేసుకుంది. రెండో రోజే చిరంజీవి సినిమా ఒకటిన్నర మిలియన్ మార్కును దాటేసింది. 

ఇక శాతకర్ణికి సంబంధించి తొలి రెండు రోజుల గణాంకాలను కూడా తరణ్ ట్వీట్ చేశాడు. బాలయ్య సినిమా 4.67 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ గణాంకాల ప్రకారం రెండో రోజుకు కూడా బాలయ్య సినిమా మిలియన్ డాలర్ల మార్కును రీచ్ కాలేదు. చిరు సినిమా మాత్రం తొలి రోజే మిలియన్ మార్కును అందుకుంది.

చిరు సినిమాతో పోల్చి చూస్తే తొలి రెండు రోజుల్లో కచ్చితంగా సగం స్థాయి వసూళ్లను సాధించింది బాలయ్య సినిమా. చిరుది కేవలం మాస్ ఎంటర్ టైనర్ గా, బాలయ్యది చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాగా, ఎన్ఆర్ ఐ లను ఆకట్టుకోగల సబ్జెక్టుగా ప్రచారం లభించినా మెగాస్టార్ సినిమాదే పై చేయిగా నిలవడం గమనార్హం. బహుశా.. అంతా చిరు రీ ఎంట్రీ ప్రభావం అయి ఉండవచ్చు. 

Show comments