ఈవారం ట్రేడ్‌ టాక్‌

'ఫిదా' అంచనాలకి మించిన విజయాన్ని అందుకుంది. తొలిరోజు వినిపించిన టాక్‌కి విజయం ఖాయమని అనుకున్నారు కానీ ప్రతి రోజుకీ టాక్‌ ఇంకా బెటర్‌ అవుతూ, వారం తిరిగే సరికి సూపర్‌హిట్‌ స్టాటస్‌ అందుకుంది. తొలి వారంలో ఇరవై రెండున్నర కోట్ల షేర్‌ వసూలు చేసిన ఈ చిత్రం ఇంతవరకు డల్‌ అవలేదు. 

ఈ వీకెండ్‌లో 'గౌతమ్‌ నంద' నుంచి పోటీ వున్నా కానీ 'ఫిదా'కి వున్న టాక్‌కి, ఆదరణకి మరో సాలిడ్‌ వీకెండ్‌ ఖాయం చేసుకోవచ్చు. ఓవర్సీస్‌లో కూడా అదరగొడుతోన్న ఈ చిత్రం ఫుల్‌ రన్‌లో ముప్పయ్‌ అయిదు కోట్ల షేర్‌ సాధించగలదని అంటున్నారు. వరుణ్‌ తేజ్‌కి తొలి విజయాన్ని అందించిన ఈ చిత్రం శేఖర్‌ కమ్ములని తిరిగి ఫోర్స్‌గా నిలబెట్టింది. 

దీనితో పాటుగా విడుదలైన 'వైశాఖం' కనీసం పబ్లిసిటీ ఖర్చులు రాబట్టుకోలేక డిజాస్టర్‌ అయింది. దండుపాళ్యం 2 చిత్రానికి మాస్‌ సెంటర్స్‌లో చెప్పుకోతగ్గ ఓపెనింగ్స్‌ వచ్చాయి. ఫిదా వచ్చి 'శమంతకమణి'కి సెకండ్‌ వీక్‌పై హోప్స్‌ లేకుండా చేసింది. ఆశాజనకంగా మొదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ జర్నీ చివరకు ఫ్లాప్‌ అయింది. 

Show comments