మణిరత్నం సినిమా టైటిల్ మారింది.. టీజర్ వచ్చింది!

కార్తీ, అదితీరావ్ హైదరీలు హీరోహీరోయిన్లుగా మణిరత్నం తమిళంలో రూపొందించిన సినిమాకు తెలుగు టైటిల్ ను ఇది వరకూ ‘డ్యూయెట్’ అని ప్రకటించారు. అయితే తాజాగా ఆ సినిమా టైటిల్ మార్చారు. ‘చెలియా’ గా ఫిక్స్ చేశారు! ఇది వరకూ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘చెలి’ సెంటిమెంట్ ను ఫాలో అయినట్టుగా ఉన్నారు. ఈ సినిమాకు ‘చెలియా’ గా టైటిల్ ఫిక్స్ చేశారు.

అలాగే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఒక స్మాల్ టీజర్ ను విడుదల చేశారు. కశ్మీర్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ లోనే మణిరత్నం సహజశైలిలో కనిపిస్తోంది. ‘మై మరుపా..’ అంటూ సాగే ఏఆర్  రెహమాన్ జింగిల్ కూడా ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ లో హీరోయిన్ ను, కశ్మీర్ అందాన్ని క్లోజ్ లుక్ లో చూపించారు మణిరత్నం.  

Show comments