బాబుగారు.. ఈ మరుగుదొడ్డి ఫొటోలేంటండీ!

ఇటీవల తమ తోక పత్రిక యజమానిని కూర్చోబెట్టి బాబు ఇచ్చిన తుంటర్వ్యూ లోని ఒక క్లిప్ ఇంటర్నెట్ లో తెగ సర్క్యులేట్ అవుతోంది. బాబుగారు తన విధానాల గురించి చెప్పుకొంటూ పోతుండగా.. వాటిని విని ఆ మీడియో మోతుబరి తెగ ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఔనా.. అలానా.. ఇంత అద్భుతమా.. అంటూ ఆయన ఎక్స్ ప్రెషన్లు కొనసాగుతూ ఉంటాయి.

ఈ తుంటర్వ్యూలో బాబుగారు ఒక బృహత్తర విధానాన్ని వివరిస్తారు. ఇది కూడా బాబుగారి మార్కు ఇంగ్లిష్ లోనే కొనసాగుతుంది. అదేమనగా.. “ఎవ్విరీ రెండు గంటలకు ఒకసారి.. మీ మరుగు దొడ్డి ఫొటో తీసి పంపీమన్నాం.. అక్కడ నుంచి ప్రారంభించాం.. ఇవన్నీ మానిటర్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి పోటీ తత్వం పెరిగి 96, 97 శాతం మరుగుదొడ్లు బాగున్నాయని పొగిడే పరిస్థితికి వచ్చారు..’’ 

మరుగుదొడ్డి శుభ్రతకు సంబంధించి  బాబుగారి విధానం ఇదనమాట.. మరి మరుగు దొడ్ల శుభ్రత విషయంలో పోటీ ఏమిటో.. ప్రతి రెండు గంటలకూ ఒకసారి ఫొటోలు తీయడం ఏమిటో.. వాటిని పంపడం ఏమిటో.. ఈ పనిని ప్రభుత్వం మానిటర్ చేయడం ఏమిటో.. మరుగుదొడ్లు బాగున్నాయని పొగిడే పరిస్థితి ఏమిటో.. ఈ విధానం గురించి చెప్పిన బాబుగారి సంగతేమో కానీ.. వింటున్న వాళ్లు మాత్రం కడుపులో కెళికినట్టుగా ఫీలవుతున్నారు.

కడుక్కొంటే పోయే దాన్ని కెళుక్కొని మరీ ఆస్వాధించమంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి వర్యులు. మరి మరుగుదొడ్ల శుభ్రతలో ఇదే విధానం కొనసాగుతుందా? లేక ముందు ముందు.. ఇవి శుభ్రంగా ఉన్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించడానికి ప్రభుత్వ పెద్దలు , ప్రభుత్వ ఉద్యోగులు.. ముఖ్యమంత్రి మరుగుడొడ్ల ఇస్పెక్షన్ కు అకస్మికంగా ప్రత్యేక విమానంలో రావడం వంటివి కూడా ఉంటాయా? వేచి చూడాలంతే!

Show comments