సైట్ కొట్టేసిన సినిమా

సినిమా వ్యాపారమే అంత...అయితే రాత్రికి రాత్రి అమీరు..లేదంటే గరీబు. సినిమా ఏ మాత్రం తేడా చేసినా, పెట్టిన కోట్లు అన్నీ గోడకు వేసిన సున్నమే. ఏదో అనుకుంటారు..ఏదో అవుతుంది..సూపరెహ సబ్జెక్ట్ అనుకుంటారు..లేదా మొహమాటాలకు పోతారు. సినిమా రెడీ అవుతుంది..కొనేవాడు వుండడు..ఫైనాన్స్ తెచ్చిన వన్నీ తీరిస్తే తప్ప బొమ్మ థియేటర్లలోకి రాదు. దాంతో ఏం చేయాలి. అయిన కాడికి వున్నవి అమ్మేసి, చేతులు దులుపుకోవాలి.

ఆ మధ్య ఓ బడా నిర్మాత అలాగే చేసారట. పాపం, ఆయనకు అధికార పార్టీ అంటే కాస్త మక్కువ ఎక్కువ. మొహమాటానికే పోయారో, లేదా జడ్జిమెంట్ నే దెబ్బతీసిందో సినిమా డిజాస్టర్ అయిపోయింది. కానీ విడుదలకు ముందు రోజు పివిపి సంస్థకు ఫైనాన్స్ క్లియర్ చేయాల్సి వచ్చిందట. 

దాంతో నిర్మాత తనకు బెజవాడలో వున్న ఓ ఖరీదైన సైట్ కాగితాలను, అది కూడా హీరోకి కాస్త దగ్గరగా వుండే వ్యక్తికే ఇచ్చి, ఎందుకంటే ఆంధ్రలో అధికారపార్టీదే కదా హవా.  రాత్రికి రాత్రి అమ్మించేయాల్సి వచ్చిందట. అలా నిర్మాత గారీ ఖరీదైన సైట్, ఆ 'భారీ హీరో' గారి సినిమాకు బలైపోయింది అన్నమాట. సైట్ లు కరిగిపోకుండా వుండాలంటే, సరైన సైట్ అదేనండీ విజన్ వుండాలి. సినిమాలు తీయడం దగ్గర మొహమాటాలు పనికిరావు అదే ఈ సైట్ వ్యవహారం చెప్పే నీతి అనుకోవాలి.

Show comments