పాయె..జోన్ కూడా పాయె?

ముందు నుంచీ అనుకుంటున్నట్లే అవుతోంది. విశాఖ జోన్ విషయంలో కూడా కేంద్రం మొండి చేయి చూపించే అవకాశాలే రాను రాను ఎక్కువవుతున్నాయి. పోరాటాల పట్ల ఆంధ్ర ప్రజల అలసత్వం కేంద్రానికి బాగా తెలిసినట్లుంది. అందుకే నిర్మొహమాటంగా అలాంటిదేం లేదు అని బాహాటంగానే చెప్పేస్తోంది. ఇదిగో జోన్..అదిగో జోన్ అని ఎప్పటి నుంచో ఊరించుకుంటూ వస్తున్నారు హరిబాబు లాంటి భాజపా నేతలు. 

కానీ రాజ్య సభ సాక్షిగా అలాంటి ప్రతిపాదనేం లేదని కేంద్రం కుండ బద్దలు కొట్టింది. రాజ్య సభ సభ్యుడు నరేంద్ర కుమార్ స్వెయిన్ అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సహాయ మంత్రి రాజన్ సమాధానం ఇస్తూ ఈ విషయం స్పష్టం చేసారు. ఇప్పటి వరకు అయితే ఈస్ట్ కోస్ట్ రైల్వేను విభజించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని ఆయన స్పష్టం చేసారు. 

బెజవాడ కోసమే?

అసలు తెరవెనుక గుసగుసలు వేరుగా వినిపిస్తున్నాయి. అధికార తెలుగుదేశం అధినేత, ఆయన సన్నిహితుల ఆలోచన వేరుగా వుందన్నది ఆ గుసగుసల సారాంశం. అన్నీ విజయవాడకు తరలించినట్లుగానే జోన్ ను కూడా అక్కడికే తరలిచాలన్నది ఆలోచనగా తెలుస్తోంది. దీనివల్ల రెండు ప్రయోజనాలు. ఒరిస్సా, బెంగాల్ రైల్వే లాబీయింగ్ వర్గాలు విశాఖ జోన్ అంటే అడ్డం పడతాయి కానీ, విజయవాడ జోన్ అంటే కాదు. Readmore!

కేంద్రానికి కూడా విజయవాడ జోన్ ప్రకటించడం సులభం. తెలుగుదేశం పార్టీకి కావాల్సింది కూడా అదే కదా. విజయవాడ, గుంటూరుల్లోనే వుండాలి ఏవయినా. అదో సామ్రాజ్యం మరి. గుంతకల్ నుంచి అనకాపల్లి వరకు విజయవాడ కేంద్రంగా జోన్ తయారు చేస్తే పని సులువు అయిపోతుంది.

అందుకే ప్రస్తుతానికి కి విశాఖ జోన్ వ్యవహారాన్ని అలా వుంచి, కేంద్రం ద్వారానే పావులు కదిపించి, తప్పని సరి పరిస్థితుల్లో ఓకె అంటున్నాం. రాష్ట్రానికి జోన్ రావడం కీలకం, విశాఖ అయినా విజయవాడ అయినా అనే ప్రచారాన్ని తన మీడియా ద్వారా మెల్లగా సాగించాలన్నిది ఆలోచనగా తెలుస్తోంది. అయితే హోదా కాక మీద ఇది అంటే కష్టం కాబట్టి, ఆ ఇస్యూను అలా కోల్డ్ స్టోరేజ్ లో వుంచి, అవసరమైనపుడు సైలెంట్ గా పని కానిస్తారన్నమాట. 

ఏమయితేనేం, విజయవాడ జోన్ సంగతి పక్కన పెడితే, విశాఖ జోన్ మాత్రం వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. దీనికేం అంటారో? జోన్ వచ్చేవరకు పోరు ఆగదు అనే రొటీన్ స్టేట్ మెంట్ పడేస్తారేమో? 

Show comments

Related Stories :