మొన్న బాలయ్య.. నేడు సల్మాన్.. వీళ్లంతా ఇంతేనా?

ఇంతకీ వీళ్ల మైండ్ సెట్ ఏమిటి?  బాధ్యతాయుతమైన స్థాయిలో ఉంటూ తమ నడవడికతో అందరికీ ఆదర్శంగా ఉండటం మాట అటుంచి.. ఇంత చీప్ గా మాట్లాడతారేంటి? సినిమాల్లోనే విలువలు, ఆదర్శలను వల్లెవేసే వీళ్లకు అదంతా కేవలం సినిమాలో మాత్రమే అనే విషయంలో బాగా క్లారిటీ ఉన్నట్టుంది. నిజ జీవితంలో తాము ఎంత లేకిగా అయినా మాట్లాడగలం.. మాటల్లో చాలా దిగజారిపోగలం అనే విషయాన్ని వీరు చాటి చెబుతున్నారు..అది కూడా స్త్రీల విషయంలో! చాలా మంది కి ఆరాధ్య నీయులుగా ఉన్న వీళ్ల వ్యక్తిత్వాలేమిటో అర్థం చేసుకోవడానికి ఈ మాటలు చాలవా?

నందమూరి నటసింహం బాలకృష్ణ కొన్ని రోజుల క్రితం ఒక సినిమా ఆడియో విడుదల వేడుకలో చేసిన వ్యాఖ్యానాలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయాన్నిఎవరూ మరిచిపోలేరు. కేవలం హీరోగా అభిమానుల నుంచి నీరాజనాలను అందుకోవడమే కాదు… బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే స్థానంలో కూడా ఉన్నాడు బాలయ్య. అయినా “అమ్మాయిల వెంట పడి కడుపులు చేసేయడం..’ అని పలికాడు నటసింహం. అంతేనా.. తను చూడని ఎత్తుల్లేవు, దిగని లోతుల్లేవని కూడా తనేమిటో సెలవిచ్చాడు! ఆపై క్షమాపణలు. అదో ప్రహసనం.

ఇప్పుడు సల్మాన్ కూడా తన మనస్తత్వం ఏమిటో చాటి చెప్పాడు. తన కష్టాన్ని చూసి.. రేప్ గురి అయిన స్త్రీ కష్టం గుర్తొంచిందట ఈ అయ్యగారికి. మరి రెండు అనుభవాలకు మధ్య పోలిక ఎలా పెట్టాలనిపించిందో! రేప్ గురైన స్త్రీ కష్టాన్ని ఎక్కడ పరిశీలించి చూశాడో ఈ ఖాన్ గారు.

 ఎవరో చెబుతున్నారు.. సల్మాన్ ది పసిపిల్లాడి మనస్తత్వం అని. అంటే ఇలా మాట్లాడే వాళ్లందరినీ ‘పసిపిల్లలు’ అంటారు కాబోలు! సల్మాన్ కూడా క్షమాపణలు చెబుతాడట. ఇంకా నయం.. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది.. అంటూ ఎదురుదాడి చేయలేదు!  Readmore!

Show comments

Related Stories :