పాటేసుకుందుకు ఖైదీ రెడీ

మెగా స్టార్ ఖైదీ..సంక్రాంతికి రెడీ అయిపోతున్నాడు. ఇప్పుడు పాటల జోన్ లోకి ప్రవేశించేసాడు. దసరా వెళ్లగానే అంటే ఈ నెల 13న నుంచి హీరోయిన్ కాజల్ తో డ్యాన్స్ మూవ్ మెంట్స్ కు మెగాస్టార్ చిరంజీవి రెడీ అయిపోతున్నారు. మెగాస్టార్ కు ఇష్టమైన కొరియో గ్రాఫర్ లారెన్స్ మాస్టర్ ప్రత్యేకంగా మూవ్ మెంట్స్ కంపోజింగ్ స్టార్ట్ చేసారు. 

ఈ పాట కోసం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో భారీ సెట్ ముస్తాబయి రెడీగా వుంది. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఓ డిఫరెంట్ సాంగ్ ను ఈ సెట్ లో చిత్రీకరిస్తారట. మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 సినిమా పాటలకు వేరు వేరు కొరియోగ్రాఫర్లను ఎంగేజ్ చేస్తున్నారు. రాజు సుందరం కూడా ఓ పాట చేస్తున్నట్లు తెలుస్తోంది. యంగ్ కొరియో గ్రాఫర్లతో పాటు, సీనియర్ కొరియోగ్రాఫర్లను కూడా ఎంపిక చేసారు.

Show comments