చరణ్‌ మళ్లీ మిస్‌ చేసుకున్నాడు

'ఫిదా'కి ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు యువతరం ఫిదా అయిపోతోంది. ఇప్పటికే ముప్పయ్‌ అయిదు కోట్ల షేర్‌ మార్కుకి దగ్గరైన ఈ చిత్రం ఫుల్‌ రన్‌లో నలభై కోట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. పెట్టిన పెట్టుబడికి రెండింతలకి పైగా లాభాలు చూపిస్తోన్న ఈ సినిమాని ఎవరైనా పెద్ద స్టార్‌తో చేయాలని శేఖర్‌ కమ్ముల భావించాడు.

మహేష్‌బాబుకి ఈ కథ చెప్తే తాను దీనికి సూట్‌ అవనని అతను సున్నితంగా తిరస్కరించాడు. ప్రేమకథా చిత్రాలు చేసి ఇమేజ్‌ మేకోవర్‌ కోసం చూస్తోన్న రామ్‌ చరణ్‌ కూడా దీనిని చేయనని చెప్పడం విశేషం. ఆరెంజ్‌ తర్వాత మళ్లీ ప్రేమకథా చిత్రాన్ని అటెంప్ట్‌ చేయడానికి చాలా కాలం వేచి చూసిన చరణ్‌ ఫైనల్‌గా 'రంగస్థలం 1985' ట్రై చేస్తున్నాడు. 

శేఖర్‌ కమ్ముల ఈ కథ అతనికి చెబితే చేయనని చెప్పడంతో పాటు వరుణ్‌ తేజ్‌కి దీనిని డైవర్ట్‌ చేసాడు. తన కజిన్‌ ఈ సినిమా చేయాలని చరణ్‌ భావించాడంటే కథ అతనికి నచ్చిందనే అర్థం. కాకపోతే తన స్టార్‌ ఇమేజ్‌ గురించి ఆలోచించి ఫిదా రిజెక్ట్‌ చేసాడు.

కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకి వచ్చి ఇలాంటి రిస్కులు తీసుకుంటే తప్ప ఎవరికైనా ఇమేజ్‌ పరమైన మార్పులు రావు. రంగస్థలంకి చరణ్‌ అదే చేస్తున్నాడు కానీ దాని ఫలితం ఏమిటనేది ఇంకా తెలియదు. ప్రస్తుతానికి ఫిదాని మాత్రం అతను చేతులారా మిస్‌ చేసుకున్నాడు. Readmore!

Show comments

Related Stories :