బాలీవుడ్ లో ఇది బయోపిక్స్ సీజన్

బయోపిక్స్ కు పెట్టింది పేరైన బాలీవుడ్ లో ఇప్పుడు మరో 3 ప్రాజెక్టులు ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. షట్లర్ సైనా నెహ్వాల్, ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా, యుద్ధనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్రలు త్వరలోనే బయోపిక్స్ గా రాబోతున్నాయి. వీటికి సంబంధించి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ లైఫ్ స్టోరీ బాలీవుడ్ తెరపైకి రానుంది. వెండితెరపై సైనా పాత్రను శ్రద్ధా కపూర్ పోషించనుంది. సైనా పాత్ర తనకు దొరకడం అదృష్టమని ట్వీట్ చేసిన శ్రద్ధాకపూర్.. ఈ క్యారెక్టర్ కోసం మరింత ఫిట్ గా తయారయ్యేందుకు ఇప్పటికే జిమ్ బాట పట్టింది. టి-సిరీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.

త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్న మరో బయోపిక్ కల్పనా చావ్లా. ఇండియా నుంచి అంతరిక్షానికి వెళ్లిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లా.. తన రెండో అంతరిక్ష యాత్రలో భాగంగా స్పేష్ షిప్ పేలిపోవడంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకొని ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా వయాకామ్-18 సంస్థ సినిమా ఎనౌన్స్ చేసింది.

ఇక బాలీవుడ్ తెరపైకి రాబోతున్న మరో బయోపిక్ మణికర్నిక. ఝూన్సీ లక్ష్మీబాయ్ వీరగాధ ఆధారంగా, టాలీవుడ్ డైరక్టర్ క్రిష్ దర్శకత్వంలో రాబోతోంది ఈ సినిమా. కంగనా రనౌత్ ఇందులో లీడ్ రోల్ పోషించనుంది.

Show comments