దేశంలో ఇప్పుడు జీఎస్‌టీ తప్ప ఇంకో టాపిక్ లేదు. ఎందుకంటే, దేశ భవిష్యత్తుని డిసైడ్ చేస్తోందిప్పుడు జీఎస్‌టీ. ఫలితాలు ఆరు నెలల తర్వాత.. అని కేంద్రం చెబుతోందిగానీ, జులై 1 నుంచే దేశ ప్రజల భవిష్యత్తు క్రమక్రమంగా మారిపోతోంది. వాత మొదలైంది.. ఆయింట్‌మెంట్ ఎఫెక్ట్ తక్కువగానే వుంది. వెరసి, జీఎస్‌టీ గురించి ఇప్పుడు దేశమంతా చర్చించుకుంటోంది.
సందట్లో సడేమియా అంటూ ఇంకో జీఎస్‌టీ తెరపైకొచ్చింది. అదే త్రిష జీఎస్‌టీ. అవును, ఇది త్రిష నటిస్తోన్న ఓ సినిమాకి సంబంధించిన విషయం. మేటరేంటంటే, అరవింద్ స్వామి, త్రిష నటిస్తోన్న 'సతురంగవెట్టయ్-2' సినిమాకి సంబంధించిన ప్రమోషనే ఈ త్రిష జీఎస్‌టీ.
ఇక్కడ జీఎస్‌టీ అంటే, గ్రాండ్ సింగిల్ ట్రాక్ అని అర్థం. అద్గదీ అసలు విషయం. జీఎస్‌టీని ఎంత గొప్పగా వాడేసుకుందో కదా, 'సతురంగ వెట్టయ్ -2' సినిమా టీమ్.! అదే మరి క్రియేటివిటీ అంటే.
హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాపై ప్రీ రిలీజ్ అంచనాలు ఓ రేంజ్‌లో వున్నాయి. రీ-ఎంట్రీలో అరవింద్‌స్వామి ఎంచుకుంటున్న సినిమాలన్నీ మంచి విజయాల్నే అందుకుంటున్నాయి.
అరవింద్‌స్వామి తెలుగులో ఈ మధ్యనే 'ధృవ' సినిమాలో కన్పించిన విషయం విదితమే. ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. ఇంతకీ, త్రిష జీఎస్‌టీకి మీరు రెడీనా.?