ఇది అనసూయ మార్క్‌ 'మ్యాజిక్‌'

బుల్లితెర యాంకర్‌ అనసూయ మ్యాజిక్‌ చేసింది. అది కూడా గ్లామరస్‌ మ్యాజిక్‌. జబర్‌దస్త్‌ అనే టీవీ షో పుణ్యమా అని పాపులర్‌ అయిన అనసూయ, అంతకు ముందు న్యూస్‌ రీడర్‌గానూ పనిచేసిన విషయం విదితమే. ప్రస్తుతం సినిమాల్లో రాణించేందుకు విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది. ఆ మధ్య 'అత్తారింటికి దారేది' సినిమాలో ఆఫర్‌ వచ్చినా, సింపుల్‌గా 'నో' చెప్పేసింది అనసూయ. 

ఇక, అనసూయ నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా', 'క్షణం' చిత్రాలు ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టాయి. దాంతో, అనసూయ వెండితెరపై వెలిగిపోతుందని అంతా అనుకున్నారు. అనూహ్యంగా అనసూయకి టాలీవుడ్‌ నుంచి అవకాశాలు తగ్గాయి. సరిగ్గా ఈ టైమ్‌లోనే అనసూయ గ్లామర్‌ మ్యాజిక్‌ చేసింది హాట్‌ హాట్‌ ఫొటోసెషన్‌ చేయించుకుని, ఆ ఫొటోల్ని బయటకు తీసుకొచ్చింది. 

అంతే, టాలీవుడ్‌లో ఇప్పుడెక్కడ చూసినా అనసూయ గురించిన డిస్కషనే జరుగుతోంది. బాలీవుడ్‌ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనన్నట్లుంది అనసూయ ఫొటో సెషన్‌. ఇద్దరు పిల్లల తల్లే అయినా, అనసూయ గ్లామర్‌లో హీరోయిన్లతో పోటీ పడటమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ మాటకొస్తే, బాలీవుడ్‌లో ఐటమ్‌ బాంబ్‌లా మలైకా అరోరా ఖాన్‌ ఇప్పటికీ టాప్‌ ఛెయిర్‌లోనే వుంది మరి.! చూద్దాం.. అనసూయ హాట్‌ ఫొటోసెషన్‌తో మళ్ళీ ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువెత్తుతాయేమో.! 

అన్నట్టు గ్లామర్‌ పోటీలో అనసూయని ఎప్పుడో మించిపోయింది రష్మి. జబర్‌దస్త్‌లోనే అసూయకి గట్టి పోటీ ఇచ్చిన రష్మి, వెండితెరపైనా అదే పోటీ కొనసాగిస్తోంది. ప్రస్తుతానికైదే రష్మిదే పై చేయి బుల్లితెరపై అయినా, వెండితెరపై అయినా.

Show comments