ఈసారి చాంబర్ ఎన్నికల్లో స్టూడియో సెక్టార్ జనాల మధ్య పోటీ జరగబోతోంది. తెలుగు ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు శుక్రవారం బెజవాడలో జరగబోతున్నాయి. 48మంది కార్యవర్గ సభ్యులు ఈ ఎన్నికలో పాల్గొని ప్రెసిడెంట్ ను ఎన్నుకోవాలి. ప్రస్తుతం ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి సురేష్ బాబు ప్రెసిడెంట్ గా వున్నారు. తరువాతి వంతు స్టూడియో సెక్టార్ ది.
అందువల్ల జెమిని కిరణ్, సి కళ్యాణ్ పోటీ పడుతున్నారు. ఔట్ డోర్ యూనిట్లు, కలర్ ల్యాబ్ లు కూడా స్టూడియో సెక్టార్ కిందకే రావడంతో ఈ ఇద్దరు పోటీ పడుతున్నారు. మరి ఎవరు గెలుస్తారో అన్నది చూడాలి. జెమిని కిరణ్ కే కాస్త ఎడ్జ్ వుంటుందన్నది టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. జెమిని కిరణ్ దాదాపు అందరు నిర్మాతలతో మాంచి రాపో మెయింటెయిన్ చేయడం అన్నది ప్లస్ అవుతోంది. కళ్యాణ్ కూడా తన బలం తాను చూపించాలని తన వంతు ప్రయత్నాలు తాను చేస్తున్నారు.