పవన్ కు తగ్గ రేణు

ఒకే రకం పక్షులు ఒక గూటిలోకి చేరుతాయి అన్నట్లుగా పవన్ లాంటి వైఖరే కనిపిస్తోంది అతగాడి మాజీ భార్య రేణుదేశాయ్ మాటల్లో కూడా. ప్రజల దగ్గరకు వెళ్లినపుడు పవన్ అర్థం అయ్యీ..అర్థం కాకుండా, ఓ మాట ముందుకు, మరో మాట వెనక్కు, ఇంకో మాట పక్కకు ఎలా మాట్లాడతారో జనాలకు ఇప్పటికే చాలా సార్లు అర్థం అయింది.

తాజగా రేణుదేశాయ్ కూడా అలాగే మాట్లాడుతోంది. రెండో పెళ్లిపై ఆమె ఓ ఇంటర్వూలో మాట్లాడిన మాటలు భలే చిత్రంగా వున్నాయి. రెండో పెళ్లి చేసుకున్నా పవన్ పై ప్రేమ చావదు, కొత్త వ్యక్తిపై ప్రేమ పుట్టదు. అయినా ఇప్పటికి నాకు ఇంకా ముఫ్ఫైనే. పెళ్లి మీద మనసు లాగుతోందనే భయం కలుగుతోంది. అయినా వచ్చేవాడు రెండో మొగుడు, పిల్లలకు సవితి తండ్రే అవుతాడు కదా? అందుకే భయంగా వుంది. పైగా మొదటిసారి లాగే రెండో సారి కూడా అవుతుందేమో? అందుకే ఇలా వుండిపోతా. కానీ ఎప్పుడైనా ఎవరైనా నచ్చితే అప్పుడు ఆలోచిస్తా. ఇలా రకరకాలుగా మాట్లాడుతోంది రేణు దేశాయ్. 

అయినా పవన్ తో ఇప్పటికీ మాంచి రాపో వుందని, పిల్లలను, మాజీ భార్యను పవన్ చాలా బాగా చూసుకుంటారని, ఎప్పటికప్పుడు వారి అవసరాలు కనిపెట్టి తీరుస్తుంటారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల టాక్. పైగా పవన్ అక్కడకు వెళ్తుంటారని, రేణు తన సోదరి ఇంటికి ఇక్కడకు వస్తుందని తెలుస్తోంది. అలా వచ్చినపుడల్లా కలుస్తుంటారని అంటారు. అలాంటపుడు ఇంక ఎందుకు రేణుకు ఈ అక్కర్లేని ఆలోచనలు?

Show comments