ఈ వీకెండ్ లైట్ తీస్కో గురూ...!

సినీ అభిమాని ప్రతి వీకెండ్ ఎదురుచూస్తుంటాడు. ఈ వారాంతం ఏ సినిమా చూద్దామా అని ఆలోచిస్తుంటాడు. ఓ మోస్తరు అంచనాలతో ప్రతివారం కొన్ని సినిమాలు థియేటర్లలోకి వస్తుంటాయి. కానీ ఈవారం మాత్రం అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకండి. ఎందుకంటే ఈవారం కచ్చితంగా చప్పగా సాగుతుంది. ఏమాత్రం హైప్ లేని సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ శుక్రవారం నగరం, చిత్రాంగద, ఆకతాయి, 16-ఎవ్రీ డీటెయిల్ కౌంట్ అనే సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటిలో ఏ ఒక్క సినిమాపై అంచనాల్లేవ్.

సందీప్ కిషన్-రెజీనా హీరోహీరోయిన్లుగా నటించారు 'నగరం' సినిమాలో. ఇద్దరూ పరిచయం ఉన్న స్టార్లే. కానీ సినిమాపై మాత్రం బజ్ క్రియేట్ అవ్వలేదు. ఇక అంజలి లీడ్ రోల్ పోషించిన చిత్రాంగద సినిమా కూడా అంతే. ఈ మూవీకి సంబంధించి అంజలి తప్ప మరో ఎలిమెంట్ కనిపించడం లేదు. ఇక కొత్త నటీనటులతో తెరకెక్కిన ఆకతాయి, చదలవాడ నిర్మించిన 16-ఎవ్రీ డీటెయిల్ కౌంట్ అనే సినిమాలు ఉన్నాయనే విషయం కూడా చాలామందికి తెలియదు. 

ఎగ్జామ్ సీజన్ కావడంతో కాస్తోకూస్తో హైప్ ఉన్న సినిమాలేవీ థియేటర్లలోకి రావడంలేదు. కాటమరాయుడు రిలీజ్ వరకు దాదాపు ఇదే పరిస్థితి ఉంది. సో.. ఈ వీకెండ్ సినిమాల గురించి ఆలోచించకుండా మరో హ్యాంగ్-అవుట్ కోసం ట్రై చేయడం బెటర్.

Readmore!
Show comments