చిరంజీవి కూతురు సుష్మిత కొణెదలను స్టయిలిస్ట్ గా తీర్చిదిద్దేందుకు తండ్రికొడుకులు బాగానే కష్టపడుతున్నారు. ఖైదీ నంబర్ 150కు స్టయిలిస్ట్ గా పనిచేసిన సుష్మిత, ఇప్పుడు రామ్ చరణ్ కొత్త సినిమాకు కూడా స్టయిల్ అద్దబోతున్నారు. ఇంతవరకు బాగానే ఉందికానీ.. వర్క్ పరంగా, వ్యక్తిగతంగా విమర్శలు ఎదుర్కొన్న సుస్మిత.. ఇప్పుడు రామ్ చరణ్-సుకుమార్ సినిమాతో ఇంకెన్ని వివాదాలకు తెరతీస్తుందోనని మెగాభిమానులు భయపడుతున్నారు.
ఖైదీ నంబర్ 150 సినిమా నుంచి అర్థాంతరంగా క్యాథరీన్ బయటకెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఐటెంసాంగ్ కోసం ఆమెను అందరికంటే ముందు తీసుకొని, తీరా షూటింగ్ టైమ్ కు వచ్చేసరికి క్యాథరీన్ స్థానంలో లక్ష్మీరాయ్ ను తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సుస్మిత పేరు ప్రధానంగా తెరపైకి వచ్చింది. క్యాథరీన్ ను బయటకు పంపించడంలో ఆమెదే కీలకపాత్ర అంటూ కథనాలు కూడా వచ్చాయి. వీటితో పాటు సినిమాలో చిరంజీవిని కొన్ని యాంగిల్స్ లో స్టయిలిష్ గా చూపించడంలో కూడా సుస్మిత ఫెయిల్ అయ్యారనే విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా జీన్స్ ప్యాంట్ పై లుంగీ కట్టించడం, ఇప్పటికే వాడివదిలేసిన స్టయిల్స్ ను మళ్లీ తెరపైకి తీసుకురావడం లాంటి పనుల్ని సుస్మిత చేశారని విమర్శలు చేశారు.
ఇప్పుడీ స్టయిలిస్ట్ రామ్ చరణ్ సినిమాకు కూడా వర్క్ చేస్తున్నారు. అసలే సుకుమార్ సినిమా. చిన్న తేడా వచ్చినా సహించడు. అవుట్ పుట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాడు. అలాంటి దర్శకుడి సినిమాలోకి సుస్మిత ఎంటర్ అయింది. సో.. ఈసారి ఎలాంటి వివాదాలు చెలరేగుతాయోనని అంతా భయపడుతున్నారు.