సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఐదు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్ళారు. ఐదు రోజులపాటు ఆయన అక్కడే వుంటారు. ప్రతిష్టాత్మక హార్వార్డ్ యూనివర్సిటీలో పవన్‌కళ్యాణ్ ప్రసంగించనుండడం గమనార్హం. ఫిబ్రవరి 11న ఈ ప్రసంగం వుంటుంది.
హార్వార్డ్ యూనివర్సిటీలో పవన్‌కళ్యాణ్ ఎలాంటి ప్రసంగం చేస్తారన్నదానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. గత కొద్ది రోజులుగా పవన్‌కళ్యాణ్ హార్వార్డ్ యూనివర్సిటీలో చేయనున్న ప్రసంగంపై కసరత్తులు చేశారట. తనకు అత్యంత సన్నిహితుడైన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా పలువురి నుంచి ప్రసంగానికి సంబంధించి సలహాలు, సూచనలు తీసుకున్నారు పవన్‌కళ్యాణ్.
ఇదిలా వుంటే, అమెరికా నుంచి తిరిగొచ్చాక ఫిబ్రవరి 16 నుంచి పవన్‌కళ్యాణ్ 'కాటమరాయుడు' సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. ఏప్రిల్ మొదటి వారంలో ఈ సినిమా విడుదల కానుంది. తమిళ 'వీరం'కి 'కాటమరాయుడు' తెలుగు రీమేక్. డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.