'గ్యారేజ్' స్టామినా ఎంత వుండాలి?

జనతా గ్యారేజ్ విడుదల తేదీకి కౌంట్ డౌన్ మొదలయింది. ఎప్పుడు అయితే ట్రయిలర్ బయటకు వచ్చిందో, మిలియన్ల వ్యూస్ వస్తున్నాయో, దానిపై క్రేజ్ పెరగడం ప్రారంభమైపోయింది. ఇప్పుడు ఈ క్రేజ్ రేంజ్ ఏ మేరకు వుండాలి అంటే, ఏ మేరకు కలెక్షన్లు కొల్లగొట్టాలి అన్న లెక్కపై ఆధారపడి వుంటుంది. అంటే సినిమా బిజినెస్ ఏ మేరకు జరిగింది? ఏ మేరకు బయ్యర్లు రావాలి అన్నదే కదా కొలమానం. 

జనతా గ్యారేజ్ కు అయిన ఖర్చే 60 నుంచి 65 కోట్ల మధ్య వుంది. దీనికి బిజినెస్ 68 కోట్ల వరకు జరిగింది. శాటిలైట్ 12 అన్నది వేరే సంగతి. 68 వరకు బిజినెస్ జరిగింది అంటే ఖర్చులు, ఇరవై శాతం కమిషన్లు కలుపుకున్నా కనీసం థియేటర్ల కలెక్షన్లు 80 కోట్ల వరకు వుండాలి. అప్పుడే బయ్యర్లు సేఫ్. అప్పుడు జనతా గ్యారేజ్ టోటల్ స్టామినా, శాటిలైట్ తో కలుపుకుని 92 కోట్లు అవుతుంది. ఏ మాత్రం పది శాతం లాభాలు అదనంగా వచ్చినా జనతా గ్యారేజ్ 100 కోట్ల సినిమా అయిపోతుంది.

టాప్ డైరక్టర్ గా కొరటాల

జనతా గ్యారేజ్ తో హ్యాట్రిక్ కొడితే కొరటాల శివ టాప్ డైరక్టర్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోతారు. టాప్ ఎందుకంటే రాజమౌళిని ఇక్కడ జాబితాలో పెట్టడానికి లేదు. ఎందుకంటే, ఆయన ఈ స్టేజ్ ను దాటేసారు. ఇక మిగిలింది త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి దాకా 80 కోట్ల రేంజ్ కు చేరలేదు. పైగా ఆయన ఇద్దరు ముగ్గురు హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. కొరటాల శివ అలా కాదు. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ ఇలా ఒక్కొక్కరిని టచ్ చేసుకుంటూ వస్తున్నారు. బొయపాటి సరైనోడు లాంటి హిట్ ఇచ్చి వుండొచ్చు కానీ, సినిమా వుండగానే సినిమా కోసం ఆయన చుట్టూ జనం తిరుగుతున్న వైనం కనిపించడం లేదు.

సరైనోడు తరువాత ఆయన మరొ సినిమా కమిట్ అయినట్లు కానీ, తమకో సినిమా చేయమని ఏ హీరో అప్రోచ్ అయినట్లు వార్తలు లేవు. బెల్లంకొండ సినిమా ఆయన ఎప్పుడో ఓకె చేసిందే. కానీ కొరటాల శివ అలా కాదు. మహేష్ స్వయంగా సినిమా అడిగాడు. రామ్ చరణ్, పవన్ చేయడానికి రెడీగా వున్నారు. సో గ్యారేజ్ బ్లాక్ బస్టర్ అయితే కొరటాల శివ రేంజ్ ఓ రేంజ్ లో వుంటుంది. 

Show comments