చిరు పక్కన జాక్విలిన్ ఫెర్నాడెజ్?

మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి పక్కన హీరోయిన్ వేట ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. బాలీవుడ్ భామ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ను దాదాపు ఫైనల్ లిస్ట్ లో టాప్ న చేర్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో హౌస్ ఫుల్ సిరీస్ తో సుపరిచతమే ఈ హీరోయిన్. ముఫై ఏళ్ల ఈ భామకు బాలీవుడ్ లో కాస్త చెప్పుకోదగ్గ హిట్ లే వున్నాయి. అందుకే ఆమెను తెలుగులో తన సరసన నటించేందుకు మెగాస్టార్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

తన 150 వ సినిమా కోసం చిరు చాలా మంది పేర్లు వెదికారు. నయనతార, అనుష్క లాంటి సీనియర్లను ఆలోచించారు. కానీ ఎవరు అంతలా సెట్ కాలేదు. అనుష్క ఫిక్స్ అని నిన్న మొన్నటి దాకా అనుకున్నారు. కానీ ఇటీవల బయటకు వచ్చిన అనుష్క స్టిల్స్ చూసి చిరంజీవి మనసు మార్చుకున్నట్లు వినికిడి. అయినా జాబితాలో జాక్విలిన్ పేరు తరువాత అనుష్క పేరే వుందట ఇంకా. మొత్తానికి మరో క్రేజీ బాలీవుడ్ భామ తెలుగుకు పరిచయం అయ్యేలాగే వుంది.

Show comments