బోయపాటి స్టయిల్‌ మార్చక తప్పలేదు

ఇదివరకటిలా మాస్‌ హీరోలు అనిపించుకోవడానికి హీరోలు ఇష్టపడడం లేదు. గతంలో మాస్‌ హీరో ఇమేజ్‌ వస్తే ఇక వారికి తిరుగు వుండేది కాదు. కానీ ఇప్పుడు ఏ హీరో అయినా ఒకటి, రెండుకి మించి మాస్‌ చిత్రాలు చేస్తే అతడిని 'మూస' హీరోగా బ్రాండ్‌ చేసేసి పక్కన పడేస్తున్నారు.

ఎన్టీఆర్‌, ప్రభాస్‌, చరణ్‌లా త్వరగా మాస్‌ ఫాలోయింగ్‌ సాధించిన హీరోలు కూడా ఇప్పుడు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే సినిమాల మీదే ఫోకస్‌ పెడుతున్నారు. అల్లు అర్జున్‌ లాంటి వాళ్లు సరదా పడి మాస్‌ అటెంప్టులు చేసినా కానీ అది ఒకటి, రెండు సినిమాలకి మించి వుండదు. ఈ నేపథ్యంలో ఫక్తు మాస్‌ చిత్రాల దర్శకుడు అనిపించుకోవడం వల్ల లాభాలు కంటే నష్టాలే ఎక్కువ.

ఈ సంగతి గ్రహించడం వల్లే ఆల్‌రౌండ్‌ సినిమాలు తీయగలనని నిరూపించుకోవడానికి బోయపాటి శ్రీను తాపత్రయ పడుతున్నాడు. అతని తాజా చిత్రం 'జయ జానకీ నాయక' పూర్తిగా క్లాస్‌ సినిమా కాదు కానీ బోయపాటి గత చిత్రాలతో పోలిస్తే మాత్రం క్లీన్‌ యు తరహా చిత్రమట. మాస్‌ దర్శకుడు అనిపించుకుంటే కొందరు హీరోలకి, కొన్ని కథలకి పరిమితం అయిపోతూ ఉండేసరికి బోయపాటి ఇలా శైలి మార్చేసాడని ఫిలింనగర్‌ టాక్‌.

Show comments