ప్రియదర్శి జాక్ పాట్ కొట్టేసాడు

ప్రియదర్శి..పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడ్డాడు. ఆ తరువాత సహజంగానే చాన్స్ లు రావడం ప్రారంభమైంది.  ఇప్పుడు ఏకంగా జాక్ పాట్ కొట్టేసాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో కీలక కమెడియన్ పాత్రకు ప్రియదర్శి ఎంపికయ్యాడు. 

మురగదాస్ లాంటి స్టార్ డైరక్టర్ సినిమా అందునా మహేష్ బాబు హీరోగా అంటే, ప్రియదర్శికి జాక్ పాట్ కాక మరేమిటి? ఈ సినిమా క్లిక్ అయినా, ప్రియదర్శి పాత్ర క్లిక్ అయినా కెరీర్ సర్రున దూసుకుపోతుంది. పైగా ఈ సినిమా ద్విభాషా చిత్రం. అందువల్ల ప్రియదర్శి తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతున్నాడు. 

ప్రియదర్శితో పాటు ఓ తమిళ నటుడు కూడా జోడీగా కామెడీ పండిస్తాడు. ఈ ఇద్దరు అక్కడా ఇక్కడా కూడా కనిపిస్తారు. అంటే ప్రియదర్శిది రెండు భాషల్లో కూడా ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాడన్నమాట. 

Show comments