క్రేజీ రెజ్లర్… సెక్సీ అథ్లెట్.. నగ్నంగా!

తమ యూట్యూబ్ సబ్ స్కైబర్లకు ఫుల్ పసందైన వీడియోను గిఫ్ట్ గా ఇచ్చారు రెజ్లర్ జాన్ సెనా, అతడి ప్రియురాలు నిక్కీ బెల్లాలు. ఆమె యూట్యూబ్ అకౌంట్ కు ఐదులక్షల మంది సబ్ స్క్రైబర్లు సమకూరడంతో.. ఈ సందర్భాన్ని వాళ్లు ఈ విధంగా సెలబ్రేట్ చేశారు. నగ్నంగా మారిపోయి డాన్సులు చేశారు. హాఫ్ మిలియన్ సబ్ స్క్రైబర్లను సంపాదించుకోవడం చాలా ఆనందకరంగా ఉందని, అందుకే తమ యూట్యూబ్ ఫాలోయర్లకు ఈ విందును ఇచ్చామని వారు పేర్కొన్నారు.

ఇటీవలే ఈ జంట మరో రకంగా కూడా వార్తల్లో నిలిచింది. రెజ్లింగ్ రింగ్ లో ప్రేమ ప్రతిపాదన ద్వారా వీరు అంతర్జాతీయంగా అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇప్పుడు ఈ వీడియోతో మరింత ఆసక్తిని రేకెత్తించారు. వీళ్లు యూట్యూబ్ లో పూర్తి నగ్న వీడియోనే పోస్టు చేసినప్పటికీ.. ఆ సైట్ కు ఉన్న పరిమితుల ప్రకారమే ఆ వీడియో ప్రచురితం అయ్యింది. అయితే వార్తల్లో నిలవడానికి ఇలాంటి ట్రిక్స్ ప్రయోగించిన వీరిపై సహజంగానే విమర్శలొస్తున్నాయి.

Show comments