శాతకర్ణి లెక్కలు చెప్పరెందుకని?

సినిమాల కలెక్షన్లు ఎవ్వరూ అధికారికంగా ప్రకటించరు. పలు మార్గాల ద్వారా ప్రకటించే కలెక్షన్ల వివరాలు పబ్లిసిటీ కోసం తప్ప వేరు కాదు. భారీ సినిమాలకు కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి అని హడావుడి చేయడం కామన్. ట్విట్టర్, వాట్సప్ ల్లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులు కలెక్షన్ల హడావుడి చేయడం అన్నది ఇటీవల కామన్ అయిపోయింది. వీటిల్లో చాలా వరకు ఫేక్ కలెక్షన్లే వుంటాయి. 

సరే, ఫేక్ కావచ్చు, కాస్త అటు ఇటు కావచ్చు ప్రతి సినిమాకు సామాజిక మాధ్యమాల్లో, వెబ్ సైట్లలో కలెక్షన్ల వివరాలు కుమ్మేస్తుంటాయి. అయితే ఒక్క శాతకర్ణి విషయంలో మాత్రం ఇది రివర్స్ లో వుంది. ఆ సినిమా కలెక్షన్ల వివరాలు అత్యంత గోప్యంగా వుంచుతున్నారు. అలా అని ఎక్కడయినా కలెక్షన్లు కనిపిస్తే మాత్రం అవి కరెక్ట్ కాదు అంటున్నాయి యూనిట్ వర్గాలు.

సరే, కరెక్ట్ కలెక్షన్లు ఎంత అంటే మాత్రం సమాధానం రావడం లేదు. ఫస్ట్ వీక్ లోనే 51 కోట్లు షేర్ వచ్చిందని అదనపు సమాచారం ఇస్తున్నారు. మరోపక్క నైజాం లెక్కలపై ఐటి రెయిడ్ జరిగింది. దాంతో అస్సలు మాట్లాడడం లేదు ఎవ్వరూ.

కానీ ఫీల్డ్ లెవెల్ లో లెక్కలు తీస్తుంటే ఎంత లెక్క పెట్టినా టోటల్ రన్ లోనే యాభై కోట్ల షేర్ దాటినట్లు కనిపించడం లేదు. శాతకర్ణి అమ్మకాలు 60 కోట్లకు కాస్త అటు ఇటుగా జరిగాయి. వినోదపు పన్ను రద్దు వస్తే బయ్యర్లకు సమస్యలేదు. కానీ కోర్టు కేసలు వగైరా సమస్యల వల్ల ఆ వ్యవహారం అబేయన్స్ లో పడింది.

నైజాం ఎనిమిది కోట్ల అడ్వాన్స్ ఇచ్చి, రన్ చేసారు కాబట్టి వాళ్లకు ఓకె. ఓవర్ సీస్ బయ్యర్ మంచి లాభాలు చేసుకున్నారు.  విశాఖ కూడా ఓకె. మిగిలిన ఏరియాలన్నీ చిన్న చిన్న మొత్తాలు కాబట్టి ఫరవాలేదు. సీడెడ్ సంగతేమిటో తెలియాల్సి వుంది.

Show comments