అనుకున్నట్టే 'కాటమరాయుడు' మిస్‌ఫైర్‌

'కాటమరాయుడు' సినిమా పాటల్ని ఒక్కొక్కటిగా యూట్యూబ్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. ఒక్కో పాట బయటకి వచ్చేకొద్దీ సినిమాపై క్రేజ్‌ పెరగాల్సింది పోయి ఫాన్స్‌ నీరుగారిపోతున్నారు. ఇంతవరకు రిలీజ్‌ చేసిన నాలుగు పాటల్లో ఏదీ పవర్‌స్టార్‌ స్థాయికి తగ్గట్టు లేదు. చిన్న చిత్రాలకి సంగీతం చేసుకునే అనూప్‌ రూబెన్స్‌ తనపై పెట్టిన అతి పెద్ద బాధ్యతకి న్యాయం చేయలేకపోయాడు.

కనీసం మెలోడీలతో అయినా అనూప్‌ ఆకట్టుకోవడం లేదు. రిలీజ్‌ చేసిన నాలుగు పాటల్లో ఒక్కటీ క్యాచీగా లేకపోవడంతో 'కాటమరాయుడు'పై అంచనాలు తగ్గుతున్నాయి. 'ఖైదీ నంబర్‌ 150'కి ఇలా ఒక్కో పాట విడుదల చేస్తుంటే ఫాన్స్‌లో ఉత్సాహం ఉరకలేసేది. అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు, రత్తాలు రత్తాలు పాటలు లిటరల్‌గా ఆ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌ చేసాయి.

అసలే డాన్సులతో ఆకట్టుకోని పవన్‌, కనీసం పాటల పరంగా అయినా జాగ్రత్తలు తీసుకునేవాడు. కాటమరాయుడు విషయంలో అనూప్‌ని ఎంచుకున్నప్పుడే అతని వల్ల అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందుకు తగ్గట్టే అనూప్‌ ఒక్కో పాటతో మరింతగా క్రేజ్‌ హరించేస్తున్నాడు. 

Readmore!
Show comments

Related Stories :