హోల్ సేల్ గా గబ్బర్ సింగ్ కు హ్యాండ్ ఇచ్చేశారు...

2012లో ఈగ, జులాయి, ఢమరుకం, దమ్ము, ఇష్క్, రెబల్, రచ్చ, గబ్బర్ సింగ్.. ఇలా పెద్ద సినిమాలు చాలానే విడుదలయ్యాయి. పేరుకు పెద్ద సినిమాలే అయినా వీటిలో చాలా ఫ్లాపులున్నాయి. అయితే పవన్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాను మాత్రం ఫ్లాప్ అని ఎవరూ అనరు. ఆ ఏడాది పెద్ద విజయాల జాబితాలో టాప్ ప్లేస్ లో నిలుస్తుంది గబ్బర్ సింగ్. ఓ విధంగా చెప్పాలంటే పవన్ కెరీర్ ను నిలబెట్టిన సినిమా అది. పైగా ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అయింది. సూపర్ హిట్ సాంగ్స్, క్యాచీ డైలాగ్స్ తో గబ్బర్ సింగ్ సినిమా అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. అయితే నంది అవార్డుల కమిటీని మాత్రం ఈ సినిమా ఎట్రాక్ట్ చేయలేకపోయింది. 2012 నంది అవార్డుల విన్నర్స్ లిస్ట్ లో ఎక్కడా గబ్బర్ సింగ్ పేరు కనిపించలేదు. 

రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో నంది అవార్డు ప్రకటించారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి కంప్లయింట్స్ లేవు. కానీ సూపర్ హిట్ అయిన గబ్బర్ సింగ్ కు మాత్రం ఏ ఒక్క కేటగిరీలో అవార్డు అందించలేదు. నిజానికి ఈ సినిమాలో పాటలు చాలా బాగుంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా, దేవిశ్రీ ప్రసాద్ కు అవార్డు ఇస్తే బాగుండేది. 

ఓవైపు పవన్ కల్యాణ్.. టీడీపీ ప్రభుత్వానికి బాగా కావాల్సిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి సంబంధించిన సినిమాకు అన్యాయం జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ అదే జరిగింది. గబ్బర్ సింగ్ కు అంతా కలిసి హోల్ సేల్ గా హ్యాండ్ ఇచ్చేశారు. 

Show comments