ఎవరికి వారే..రెండు రాష్ట్రాల తీరే

‘’...కాంగ్రెస్‌ నుంచి ఎంత మంది నాయకులు వెళ్లిపోయినా ఆ పార్టీలో ఇంకా నాయకులకు, కార్యకర్తలకు కొదవ లేదు...’’

‘’.. తొలి ఏడాది అంతా ప్రత్యర్థులను లొంగదీసుకోవడం, ప్రతిపక్షాలను బలహీనపర్చడంతో పాటు రంగుల కలల ప్రదర్శనలతో సాగిపోయింది. తనవాళ్లు ఎవరు? పరాయివాళ్లు ఎవరు? అన్నది రెండో ఏడాది నిర్ణయించుకున్నారు. మూడో ఏడాదిలో ప్రత్యర్థుల విషయంలో స్పష్టమైన గీత గీసుకున్నారు. వారిపట్ల కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ప్రజలలో తన పట్టు పెరిగిందన్న నమ్మకం కుదిరిన తర్వాతే రాజకీయ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడం మొదలుపెట్టారు...’’

‘’... ఎవరికైనా ఈ మూడేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలే కనిపించాయి గానీ వైఫల్యాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది....’’

‘’’... సమష్టి ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రజలు ఎక్కువగా ఆకర్షితులు అవుతారు కనుక సమాజంలోని వివిధ వర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం మొదలుపెట్టారు...’

Readmore!

‘’... దీంతో గుళ్లు- గోపురాలలో దేవుడిని పూజించే పూజారులు సైతం గుడి వెలుపల ముఖ్యమంత్రి ని కీర్తిస్తూ స్తోత్రాలు చదివే పరిస్థితి ఏర్పడింది...’’

‘’’... మొత్తంమీద బాహుబలి సినిమాలో శివగామి పాత్రధారి ‘నా మాటే శాసనం’ అన్నట్టుగా ఇప్పుడు  ముఖ్యమంత్రి  మాటే శాసనంగా విరాజిల్లుతోంది....’’

‘’’.. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే! నాణానికి మరోవైపు చూస్తే  సమాజంలో అసంతృప్తి బీజాలు నాటుకుంటున్నాయి. జరుగుతున్న ప్రచారంతో పోల్చితే క్షేత్ర స్థాయిలో పనులు అంతగా జరగడం లేదన్న భావన ఏర్పడింది. అన్నింటికీ మించి ప్రభుత్వం నిర్బంధంగా, నిరంకుశంగా వ్యహరిస్తున్నదన్న అభిప్రాయం వ్యాపిస్తోంది..’’

‘’.. వ్యక్తులు, సంస్థల వల్ల వారికి కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వారు చేసే ప్రచారం వల్ల ఎన్నికల నాటికి ఏది ప్రత్యామ్నాయమని ప్రజలు భావిస్తే ఆ పార్టీకే రాజకీయ లబ్ధి చేకూరుతుంది..’’

...................

ఇంక చెప్పడానికి ఏమీ లేదు. ఈ వాక్యాలు, ఎవరికి అన్వయిస్తాయో? ఏ పార్టీకి అన్వయిస్తయో, ఏ రాష్ట్రంలో అధికారంలో వున్నవారికి అన్వయిస్తాయో? ఎవరి అభిమానం మేరకు వాళ్లు అన్వయించుకోవడమే. ఉభయతారకంగా పనిచేసే వాక్యాలివి. అంతే. 

Show comments