ఇంత సడెన్ గా ఎన్టీఆర్ దుబాయ్ ఎందుకెళ్లాడబ్బా...

బాబి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇప్పటికే సెట్స్ పైకి వచ్చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్టులతో కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. రేపోమాపో ఎన్టీఆర్ సెట్స్ పైకి వస్తాడని అంతా ఎదురుచూస్తున్నారు. కానీ ఇంతలోనే తారక్ దుబాయ్ వెళ్లాడంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి సోమవారం నుంచి ఎన్టీఆర్ సెట్స్ పైకి వస్తాడని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ ఈ షార్ట్ గ్యాప్ లో సడెన్ గా ఎన్టీఆర్ దుబాయ్ ఎందుకు వెళ్లాడనేది హాట్ టాపిక్ గా మారింది. 

బాబి సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో 3 స్పెషల్ లుక్స్ లో కనిపిస్తాడనే టాక్ ఎప్పట్నుంచో నడుస్తోంది. వీటిలో ఒక గెటప్ కు మేకోవర్ అయ్యేందుకే ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లాడా లేక సొంత పని మీద వెళ్లాడా అనేది అందర్లో డౌట్. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఇప్పటికే జుట్టు పెంచుతున్నాడు. సినిమా ఓపెనింగ్ రోజున తలకు క్లిప్ పెట్టుకొని కనిపించాడు. దానికి కొనసాగింపుగానే స్పెషల్ లుక్ కోసం దుబాయ్ వెళ్లాడనే ప్రచారం జరుగుతోంది. 

ప్రస్తుతానికైతే తారక్ నయా లుక్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. 2 భారీ షెడ్యూల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీఆర్ కొత్త స్టిల్ తో ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈలోగా తారక్ కొత్త గెటప్ ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అవుతాయేమో చూడాలి. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దాదాపు 3 నెలలు గ్యాప్ తీసుకొని, ఎన్టీఆర్ స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి.

Show comments