'ఖైదీ'తో మెగా హీరోలు

ఖైదీ నెంబర్ 150 సినిమా టాకీ దాదాపు పూర్తి కావచ్చింది. మరో మూడు నాలుగు రోజుల్లో ఈ సినిమా టాకీ పూర్తయిపోతుందని వినికిడి. చిరంజీవి ఓ పక్కన డబ్బింగ్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. పాటల పిక్చరైజేషన్ మాత్రం స్టార్ట్ కావాల్సి వుంది. ఎవరి అభిప్రాయాలు ఎలా వున్నా, ముందుగా అనుకున్నట్లు సంక్రాంతి పండగకే విడుదల చేయాలని నిర్మాత రామ్ చరణ్ పట్టుదలగా వున్నారట. 

ఆ మేరకు పనులు అన్నీ లాస్ట్ మినిట్ వరకు పెండింగ్ పెట్టుకోకుండా, చకచకా కానిచ్చేస్తున్నారు. దసరాకు సినిమాకు సబంధించి, ఏదైనా విడుదల చేయాలని భావిస్తున్నారు.  ఇదిలా వుంటే ఖైదీ నెంబర్ 150 సినిమాలో తాము ఎక్కడో ఓ చోట కనిపిస్తామని మెగా యంగ్ హీరోలు ముచ్చట పడుతున్నట్లు తెలుస్తోంది. 

అందుకే ఓ పాటలో తళక్కున రామ్ చరణ్,  సాయి ధరమ్, వరుణ్ తేజ కనిపించే అవకాశం వుందని వినికిడి. మరి బన్నీ పేరు ఇంకా వినిపించడం లేదు. పవన్ సంగతి సరే సరి, ఆయన ఇలాంటి వాటికి అతీతం. బన్నీ, పవన్ కూడా కనిపిస్తే, ఖైదీ నెంబర్ 150కి వచ్చే బజ్ ఇంతా అంతా కాదు.

Show comments