ఏంజెల్ ను తరుముతున్న హీరోలు

బాపు కార్టూన్ ఒకటి వుంది. జరుగు జరుగు ఇంకొకడొస్తున్నాడు అని. బడ్డీ హీరో నాగ అన్వేష్ పరిస్థితి అలాగే వుంది. అతగాడు నటించిన రెండో సినిమా ఏంజెల్. ఈ సినిమాకు ఏ డేట్ అనుకున్నా, ఏదో హీరో సినిమా వచ్చి మీద పడుతూనే వుంది. ఏప్రియల్ 12 అనున్నారు. 19 ఫిక్స్ అనుకున్నారు. కానీ అక్కడ కేశవ, రారండోయ్ వేడుక చూద్దాం వంటి సినిమాలు వచ్చాయి. దాంతో 26 కు వెళ్దాం అనుకున్నారు. కానీ అంతలో రారండోయ్ అక్కడి మారింది. 

సరే అని జూన్ 2 కు ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు అక్కడ కూడా సినిమాలు వచ్చి పడుతున్నాయి. 26న వస్తుంది అనుకున్న రాజ్ తరుణ్ అంధగాడు 1వ తేదీకి ఫిక్సయింది.  ఇంద్రగంటి మోహన కృష్ణ అమీతుమీ డేట్ అప్పుడే ఫిక్స్ అయింది. అలాగే సీనియర్ వంశీ 'ఫ్యాషన్ డిజైనర్' వచ్చే అవకాశం వుంది. అయినా కూడా మరి వెనక్కు వెళ్లే అవకాశం కూడా లేదు. ఇంక ఎక్కడో అక్కడ తెగించి సెటిల్ కావాల్సిందే.

Show comments