పిక్‌ టాక్‌: 'కబాలి' విత్‌ ఐటమ్‌ బాంబ్‌

'కబాలి' అంటే రజనీకాంత్‌ సినిమా అని అందరికీ తెలుసు. కానీ, ఈ ఫొటోలో ఉన్న 'కబాలి' సంగతి వేరు. ఇదొక పెట్‌ డాగ్‌. దాని పేరు 'కబాలి'. ఫొటోలో వున్న ఐటమ్‌ బాంబ్‌ ఎవరో తెలుసా.? 'రేసుగుర్రం' సినిమాలో 'బూచాడే..' అంటూ ఐటమ్‌ సాంగ్‌లో దుమ్ము రేపేసిన ఐటమ్‌ బాంబ్‌ కైరా దత్‌. 

ఇంతకీ, ఈ 'కబాలి' ఎవరో చెప్పలేదు కదా.! ఈ బ్యూటీఫుల్‌ 'కబాలి' టాలీవుడ్‌ దర్శకుడు పూరిజగన్నాథ్‌ పెట్‌ డాగ్‌. పెంపుడు జంతువుల్ని తమ సొంత పిల్లల్లా సాకుతుంటారు కొందరు. పూరిజగన్నాథ్‌ కూడా అంతే. 'సన్‌ ఆఫ్‌ పూరి' - 'కబాలి' అంటూ ఈ ఫొటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది కైరా దత్‌. 

అన్నట్టు కైరా దత్‌, పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పైసా వసూల్‌' సినిమా కోసం ఐటమ్‌ సాంగ్‌ చేస్తోన్న విషయం విదితమే. బాలకృష్ణ సరసన ఈ సినిమాలో హీరోయిన్‌గా ముస్కాన్‌ నటిస్తోంది.

ముస్కాన్‌ని పూరి కనెక్ట్స్‌ ద్వారా ఎంపిక చేశారు. పూరి కనెక్ట్స్‌ నుంచే చాలావరకు 'పైసా వసూల్‌' సినిమాకోసం నటీనటుల్ని ఎంపిక చేసిన సంగతి తెల్సిందే కదా.

Show comments