ఆన్‌లైన్లో పేకాడితే మూడేళ్ల జైలు

తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్‌రావుకు పేకాట అంటేనే ముక్కు మీద కోపం వ‌స్తుంది. పేకాట మీద అంత‌లా ఆవేశం క‌లిగించేందుకు కార‌ణ‌మైన సంఘ‌ట‌న‌లు ఆయ‌న జీవితంలో ఏమి జ‌రిగాయో తెలియ‌దు గాని పేక అనే మాట వినబ‌డితేనే ఆగ్ర‌హంతో ఊగిపోతారాయ‌న‌.

అధికారంలోకి రాగానే హైద‌రాబాద్‌తోపాటు, తెలంగాణ రాష్ట్ర‌మంతా పేకాట క్ల‌బ్‌ల‌ను మూయించేశాడు. ఆదాయం కోల్పోయిన క్ల‌బ్ యజ‌మానులు కేసీఆర్‌ను క‌లిసి క్ల‌బ్‌ల‌ను తెరిపించాల‌ని కోర‌గా ఇంకోసారి ఈ విష‌య‌మై వ‌స్తే కాళ్లు విర‌గ్గొడ‌తాన‌ని వార్నింగ్ ఇచ్చాడు.

అక్ర‌మ జూద‌శాల‌ల‌పై ఉక్కుపాదం మోపారు. ర‌హ‌స్యంగా అపార్ట్‌మెంట్లు, ఇళ్ల‌లో పేకాట ఆడుతున్న వారిపై కూడా విస్త్ర‌తంగా దాడులు జ‌ర‌పాల‌ని పోలీసులను ఆదేశించాడు.

అయితే మ‌న‌సుంటే మార్గ‌ముంటుంద‌న్న‌ట్టు పేకాట వ్య‌స‌న‌ప‌రులు ప్ర‌త్యామ్నాయాల కోసం వెతికారు. ఆన్‌లైన్ ర‌మ్మీ వీరికి అనువుగా దొరికింది. దీంతో ఇప్ప‌డు ఆడ‌, మ‌గ తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ ఆన్‌లైన్ పేకాట‌లో ముక్క‌లు పంచుతున్నారు.

బెడ్రూంలో, బాత్రూంలో, ఆఫీసులో.. ఇలా కొంచెం విరామం దొరికినా పేకాట యాప్‌లు ఓపెన్ చేస్తున్నారు. వీటి కార‌ణంగా ఆస్తులు అమ్ముకున్న‌వాళ్లు, కుటుంబానికి దూర‌మైన వాళ్లు వ్య‌స‌నాన్ని వీడ‌లేక చివ‌రికి దొంగ‌త‌నాలు, దోపిడీల‌కు పాల్ప‌డిన వాళ్లు కోకొళ్ల‌లు.

దీనికి అడ్డుక‌ట్ట వేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్రంలో ఆన్‌లైన్ పేకాట‌ను ర‌ద్దుచేస్తూ స‌రికొత్త నిర్ణ‌యం తీసుకుంది. ఆన్‌లైన్‌లో ర‌మ్మీ ఆడేవారికి మూడేళ్ల జైలు శిక్ష విధించేలా చ‌ట్టం చేసింది.

ఆన్‌లైన్‌లో పేకాట ఆడేవారిని ప‌ట్టుకునేందుకు ప్ర‌భుత్వం టెక్నాల‌జీ ఉప‌యోగించనుంది. ర‌మ్మీ వెబ్‌సైట్లు ఎక్కువ‌గా ఓపెన్ అవుతున్న ఐపీ నెంబ‌ర్లను గుర్తించి దాడులు చేయాల‌ని పోలీసు విభాగాన్ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఆదేశించింది.

మొబైల్‌లో యాప్‌ల డౌన్లోడ్‌ల‌ను నిలిపివేసే అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తుంది. అయితే ఇందులో అనేక లీగ‌ల్ విష‌యాలు ముడిప‌డి ఉన్నందున ఆన్‌లైన్ పేకాట రాయుళ్లను మార్చాల‌నే ప్ర‌భుత్వ ఆలోచ‌న ఎంత వ‌ర‌కు స‌క్స‌స్ అవుతుంద‌న్న‌ది డౌటే.

Show comments