ఆస్కార్ బరిలో ధనుష్ సినిమా!

 

ఆస్కార్ బరిలో ధనుష్ సినిమా! 
చాలా సినిమాలే పోటీ పడ్డా… చివరకు తమిళ హీరో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన ‘విసారణై’ ఆస్కార్ టికెట్ పొందింది. ఉత్తమ విదేశీ క్యాటగిరీలో అవార్డు కోసం భారత్ తరపు నుంచి పోటీకి ఈ సినిమాను ఎంపిక చేశారు.  ఈ మేరకు ఎంపిక కమిటీ ధ్రువీకరించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఆస్కార్ అవార్డుల బరిలో చాలా విదేశీ సినిమాలతో ఈ తమిళ సినిమా పోటీ పడాల్సి ఉంటుంది.  విదేశీ క్యాటగిరీలో ఈ సినిమా అవార్డును సొంతం చేసుకుంటుందా లేదా.. అనేదెలా ఉన్నా, ఒక దక్షిణాది సినిమా ఈ అర్హత సంపాదించడం ఆసక్తికరమైన అంశం.

ఈ మధ్య కాలంలో ఆస్కార్ ఎంట్రీలు పొందుతున్నది హిందీ, ఉత్తరాది సినిమాలే. దానికి బ్రేకేస్తూ.. ధనుష్ నిర్మిత ‘విసారణై’ ఎంట్రీని సంపాదించింది. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మూలం “లాకప్’’ అనే తమిళ నవల. పోలీసుల కర్కశత్వ సంబంధ చిత్రమిది.

నాయకుడు, అంజలి, భారతీయుడు,జీన్స్ తదితర సినిమాల తర్వాత ఇండియా తరపున ఆస్కార్ బరిలో నిలిచిన సినిమా ఇది. 

Show comments