అక్కడా శివ ఎడమొహమేనా?

దర్శకుడు కొరటాల శివకు, సినిమాటోగ్రాఫర్ తిరున్నావక్కరసుకు మధ్య అంతగా సింక్రనైజ్ కాలేదని, అది జనతా గ్యారేజ్ మీద ప్రభావం చూపిస్తోందని వార్తలు వినవచ్చాయి. నిజమో, కాదో అని జనం అనుకుంటుంటే, నిన్నటికి నిన్న గ్యారేజ్ అడియో ఫంక్షన్ లో వాళ్లిద్దరిని గమనిస్తే మాత్రం నిజమే అనిపిస్తుంది. హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ, చివర్లో అర్జెంట్ గా తిరున్నావక్కరసును కూడా గుర్తు చేసుకున్నారు.

తనకు ఇష్టమైన సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ శిష్యుడిగా, తనకు ఇష్టమైన దేవర్ మగన్ సినిమాకు అసిస్టెంట్ కెమేరా మెన్ గా పనిచేసాడని, ఆ విధంగా తనకు ఎంతో దగ్గరయ్యాడని చెప్పుకుంటూ వచ్చాడు. అంతవరకు దూరంగా చివర్న వున్న తిరు ను దగ్గరకు తీసుకున్నాడు.  

ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే, అప్పటి వరకు ఎవరు ఏం చెప్పినా, ఏదో విధంగా తన బాడీ లాంగ్వేజ్ లో స్పందన కనిపింప చేసిన దర్శకుడు కొరటాల శివ, ఈ సమయంలో అక్కడ జరగుతున్న దాంతో తనకు సంబంధం లేదనట్లు వుండిపోయాడు. కావాలంటనే విడియో మరోసారి చూసుకోవచ్చు. 

ఎన్టీఆర్ స్పీచ్ కు, ప్రశంసలకు తిరు కూడా ఏమీ పెద్దగా స్పందించలేదు. తిరిగి చివర్న తన ప్లేస్ లోకి వెళ్లిపోయాడు. అంత పెద్ద సినిమాటోగ్రాఫర్ ను స్టేజ్ పై అలా చివర్న వదిలేయడం ఏమిటో? కొరటాల శివ ఆ సమయంలో పెద్దగా స్పందన లేకుండా వుండడం ఏమిటో? సమ్ థింగ్..సమ్ థింగ్..?

Show comments