త్రిష హీటెక్కిస్తుందా.? భయపెడ్తుందా.?

కెరీర్‌లో కమర్షియల్‌ సినిమాల్ని పక్కన పెట్టి, ప్రయోగాత్మక చిత్రాలవైపు పెద్దగా దృష్టిపెట్టని హీరోయిన్ల లిస్ట్‌లో త్రిష పేరు ముందుంటుంది. అసలు అలాంటి సినిమాలు తనకు పెద్దగా నచ్చవని త్రిష చెబుతూ వచ్చేది. ఒకటీ అరా కమర్షియల్‌ జోన్‌ కాకుండా, సెపరేట్‌ ట్రాక్‌లో త్రిష సినిమాలు చేసిందనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, త్రిష తాజాగా 'నాయకి' అనే సినిమాలో నటించింది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తయిపోయిందిగానీ, విడుదల విషయంలోనే కాస్త తడబడింది. ఎలాగైతేనేం, ఈ నెల 8న విడుదలకు సిద్ధమయ్యింది 'నాయకి'. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుంది. అందరికీ తెల్సిన విషయమే ఈ సినిమాలో త్రిష, దెయ్యంలా కన్పించబోతోంది. తెలుగులోనే కాదు, తమిళంలోనూ ఇప్పుడు దెయ్యాల సినిమాల ట్రెండ్‌ నడుస్తోంది. 

తెలుగులో అయితే చాలామంది హీరోయిన్లు భయపెట్టేసి, సక్సెస్‌లు కొట్టేశారు. ఆ ట్రాక్‌లోనే త్రిష కూడా సక్సెస్‌ కొట్టేస్తానంటోంది. ఇక్కడో ఆసక్తికరమైన విషయమేంటంటే, త్రిష ఇదివరకటికన్నా హాట్‌గా కన్పించనుందట ఈ సినిమాలో. అదెంత నిజమో, సినిమా విడుదలైతేనే తెలుస్తుంది. హర్రర్‌ సినిమాల్లోనూ తమ సినిమా డిఫరెంట్‌ సినిమా అంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. త్రిష అయితే, ఇదేదో ప్రయోగాత్మక చిత్రం మాత్రమే కాదనీ, కమర్షియల్‌ హంగులూ వుంటాయని చెబుతోంది. 

సినిమాలకి గుడ్‌ బై చెప్పేసి, పెళ్ళి చేసేసుకుని లైఫ్‌లో సెటిలైపోవాలనుకున్న త్రిష, మళ్ళీ అనూహ్యంగా ఆ పెళ్ళిని అటకెక్కించేసి, సినిమాల్లో రీ-ఎంట్రీకి సిద్ధమయ్యాక ఆమె హీరోయిన్‌గా విడుదలకు సిద్ధమవుతోన్న చిత్రమిది. చూద్దాం.. 'నాయకి' సినిమాతో త్రిష హీటెక్కిస్తుందో, భయపెడ్తుందో.. హీటెక్కించేసి.. భయపెట్టేసి.. హిట్టు కూడా కొట్టేస్తుందో లేదో.!

Show comments