పిక్‌ టాక్‌: మొహం చూపించొచ్చుగా.!

సినిమాల్లో హీరోయిన్లు అంగాంగ ప్రదర్శన చేయడం మామూలే. చాలా అరుదుగా కొన్ని సినిమాల్లో హీరోయిన్‌ ఎక్స్‌పోజింగ్‌ మీద సెటైర్లేస్తూ, 'మొహం చూపించొచ్చు కదా..' అంటుంటాడు హీరో. ఆ మాటే ఇప్పుడు పూనమ్‌ పాండేని ఉద్దేశించి అనాలేమో. ఎందుకంటే, తన శరీరం మొత్తంలో 'సేలబుల్‌' ఐటమ్స్‌ ఏంటో ఆమెకు బాగా తెలుసు. అందుకే మొహాన్ని పక్కన పెట్టి, ఆయా శరీర భాగాల్ని ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ చేస్తుంటుంది. 

సోషల్‌ మీడియా అనేది పూనమ్‌ పాండే కోసమే అవతరించిందా.? అన్న రేంజ్‌లో ఆమె 'వాడకం' వుంటోంది. ట్విట్టర్‌లో ఈమె ఫొటోలకి 'సెన్సార్‌' కూడా జరుగుతుంటుందండోయ్‌. అదీ పూనమ్‌ పాండే హాట్‌ అప్పీల్‌కి వున్న ఫాలోయింగ్‌. అది ఫాలోయింగ్‌ కాదు, జుగుప్సాకరమైన ఆమె ఫొటోల్ని చూసి ట్విట్టర్‌ భయపడిందనాలేమో.! 

ఇక, ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌ని ఎక్కువగా నమ్ముకుంటోంది పూనమ్‌ పాండే. మొన్నటికి మొన్న మాల్దీవ్స్‌లో ఎంజాయ్‌ చేసిన ఈ బ్యూటీ, అక్కడి బికినీ ఫొటోలతో హల్‌చల్‌ చేసింది సోషల్‌ మీడియాలో. ఇక, తాజాగా ఇదిగో, ఈ ఫొటోని సోషల్‌ మీడియాలో పెట్టింది. అందుకే మరి, మొహం చూపించొచ్చుగా.. అనేది. హాట్‌ హాట్‌ పబ్లిసిటీ స్టంట్స్‌కి అయినా హద్దుండాలి కదా.. అంటారా.? అక్కడున్నది పూనమ్‌ పాండే. చిత్రంగా, ఆమె ఫొటోలకి జుగుప్సాకరమైన కామెంట్స్‌ వచ్చినా, డోన్ట్‌ కేర్‌ నైజం ఆమెది.

Show comments