'బొడ్డు మీదకి కొబ్బరికాయను విసరడమేంటో.. అందులో ఏం సెక్సప్పీల్ కన్పిస్తుందో..' అంటూ ఓ షోలో, తాప్సీ బీభత్సమైన పంచ్ వేసేసింది. అదీ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మీద సెటైరికల్‌గా. నిజమే, 'బొడ్డు మీద పూలు, పళ్ళు' అన్న కాన్సెప్ట్‌కి పేటెంట్ హక్కులు ఏమన్నా వుంటే, అది దర్శకేంద్రుడికి మాత్రమే. ఆయన సినిమాల్లో ఖచ్చితంగా అవి వుండాల్సిందే.!
రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన 'ఝుమ్మంది నాదం' తాప్సీకి హీరోయిన్‌గా తెలుగులో తొలి సినిమా. తాప్సీ గ్లామర్‌ని ఏ స్థాయిలో చూపించాలో దర్శకేంద్రుడు ఆ స్థాయిలో చూపించేశాడు. అదంతా గతం.
ఆ సినిమా అనే కాదు, తాప్సీ తెలుగులో చేసిన దాదాపు అన్ని సినిమాల్లోనూ అంతకు మించిన గ్లామర్‌నే ప్రదర్శించేసింది. కానీ, బాలీవుడ్‌కి వెళ్ళాకే తాప్సీ పూర్తిగా మారిపోయింది. అలా మారిపోవడం వల్లేనేమో.. 'సెక్సప్పీల్' అన్న మాట మీద సెటైర్లు వేసే స్థాయికి ఎదిగిపోయింది.
ఏకంగా రాఘవేంద్రరావు మీద పంచ్ వేసిన తాప్సీపై విమర్శలు వెల్లువెత్తడంతో, చేసేది లేక క్షమాపణ చెప్పేసింది. 'ఏదో సరదాగా చెప్పిన మాట అది. అంతే తప్ప, తెలుగులో నా తొలి సినిమాకి దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావుగారినెలా విమర్శిస్తాను.?
నా మాటల్లోని ఫన్‌ని మాత్రమే తీసుకోండి.. ఎవరైనా హర్ట్ అయితే క్షమాపణ చెబుతున్నా..' అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది తాప్సీ. మొత్తమ్మీద, 'బొడ్డు మీద కొబ్బరికాయ'లోని సెక్స్ అప్పీల్ సంగతేమోగానీ, అది తెచ్చిన వివాదం తాలూకు తలనొప్పి ఏంటో తాప్సీకి అర్థమయినట్టుందిప్పుడు.!