జక్కన్న ట్రయిలర్ అదిరిందిగా

సరైన కామెడీ సినిమా చూసి ఎన్నాళ్లయింది..అందునా సునీల్ తో కలిసి, కమెడియన్లంతా కామెడీ కుమ్మేసి ఎన్నాళ్లయింది. ఈ రోజు విడుదలైన జక్కన ట్రయిలర్ చూస్తుంటే ఆ కొరత తీరినట్లుగానే వుంది. సునీల్ పాటలు, ఫైట్లు ఆ సంగతి అలా వుంచితే, థర్టీ ఇయర్స్ పృధ్వీ చెలరేగిపోయినట్లు కనిపిస్తోంది. భలే డైలాగులు పేల్చాడు ట్రయిలర్లో.. 

Watch Jakkanna Theatrical Trailer

ఒక్కసారి నేను సీన్లోకి ఎంటరయ్యాక రాసిన రైటర్ కే డైలాగులు వుండవ్.. తొక్కి పారేస్తా..  ఐయామ్ ఏన్ ఓషన్... ఐ హావ్ వన్ స్టేషన్.. దటీజ్ పోలీస్ స్టేషన్.. అంటూ పృధ్వీ బాలయ్య స్టయిల్ లో చెప్పిన డైలాగులు అదిరాయి. ..తిత్తిమీద కొడితే కనల్ కన్నన్ కైనా నొప్పివస్తుందంటూ సప్తగిరి నవ్వుల పూయించాడు. 

సో..సునీల్ ఈసారి తన ఒరిజినల్ నవ్వుల ట్రాక్ పైనే బండి నడిపించేటట్లు కనిపిస్తున్నాడు. సుదర్శన రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆకెళ్ల వంశీకృష్ణ దర్శకుడు. Readmore!

Show comments

Related Stories :