రాజ్ తరుణ్ మళ్లీ కామియో రోల్

నాని-విరించి వర్మ సినిమా క్లయిమాక్స్ ముందు తళక్కున మెరిసిన హీరో రాజ్ తరుణ్ మరో సినిమాలో కూడా ఓ ఫ్రెండ్లీ అప్పీరియెన్స్ కు ఓకె అన్నాడు. దిల్ రాజు-బెక్కం వేణుగోపాల్ నిర్మించే నాన్న-నేను- నా బాయ్ ఫ్రెండ్స్ సినిమాలో ఓ గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్నాడు. ఈ సినిమాకు కొత్త దర్శకుడు పని చేస్తున్నాడు. ముగ్గరు కొత్త కుర్రాళ్లు నటిస్తున్నారు. 

సినిమా లైన్, కథ, నచ్చి దిల్ రాజు ఈ ప్రాజెక్టును టేకప్ చేసారు. కథ కోసం ఓ కీలకమైన గెస్ట్ రోల్ కు అవసరమై రాజ్ తరుణ్ ను అడిగితే వెంటనే ఓకె అన్నాడు. బెక్కం వేణుగోపాల్ గతంలో రాజ్ తరుణ్ తో సినిమా చూపిస్తమావా అనే పెద్ద హిట్ సినిమా నిర్మించాడు. ఆ పరిచయం, స్నేహంతోనే రాజ్ తరుణ్ ఈ పాత్ర చేస్తున్నాడు.

Show comments