రొమాన్స్‌ బాలయ్యకి సూటవదా.?

50 ప్లస్ వయసులో కూడా యంగ్ హీరోయిన్లతో హాట్ హాట్‌గా తెరపై రొమాన్స్‌ చేసేస్తుంటారు హీరో బాలకృష్ణ. అయినాసరే, తనకు రొమాంటిక్‌ పాత్రలు సూటవ్వవని బాలకృష్ణ స్వయంగా ఒప్పేసుకోవడం విశేషమే మరి. మాస్‌ని అలరించాలంటే విలన్లతో బీభత్సమైన ఫైట్లు, అదిరిపోయే డైలాగులు చెప్పడం మాత్రమే కాదు, హీరోయిన్లతో ఘాటైన రొమాన్స్‌ కూడా తప్పదు. అలాంటి పాత్రల్లో మెప్పించబట్టే, బాలకృష్ణ మాస్‌ హీరో అయ్యారు.

చిత్రంగా, బాలకృష్ణ తనకు రొమాంటిక్‌ పాత్రలు సరిపడవని చెప్పడంతో అంతా షాక్‌కి గురయ్యారు. అయితే, తనలోని బలాన్నే కాదు, బలహీనతల్నీ ఒప్పేసుకోవడం హుందాతనమే అవుతుంది కదా.! ఈ విషయంలో బాలయ్యని గ్రేట్‌ అని ఒప్పుకోక తప్పదు. అన్నట్టు, సిక్స్‌ ప్యాక్‌ ట్రెండ్‌ మనది కాదంటూ బాలకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మరోపక్క, ఈ ఏడాది చివర్లో నిర్మాతగా మారతాననీ బాలకృష్ణ అంటున్నారు. 

ఇక, తన వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి బాలకృష్ణ మరోసారి స్పష్టతనిచ్చారు.  ఈ ఏడాది చివరినాటికి మోక్షజ్ఞ ఎంట్రీ వుంటుందన్నది బాలయ్య తాజాగా చెబుతున్న మాట. అయితే, తన 100వ సినిమాలో మోక్షజ్ఞ నటిస్తాడని గతంలో బాలకృష్ణ చెప్పారుగానీ, అది జరగలేదు. ఈసారేమవుతుందో మరి. అన్నట్టు, దర్శకత్వం వైపు కూడా బాలకృష్ణ అడుగులు వేస్తున్నారట. ఆ తీపి కబురు కూడా త్వరలోనే చెబుతానంటున్నారాయన.

మొత్తమ్మీద, హీరోయిన్లతో తెరపైనా, సినిమా ప్రమోషన్లలోనూ చలాకీగా కన్పించే బాలయ్య ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ పండించడంలో ఇబ్బంది పడ్తారంటే నమ్మగలమా.? Readmore!

Show comments