బన్నీకూడా జవానేనంట

మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ-రచయిత బివిఎస్ రవి కాంబినేషన్ లో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు జవాన్ అన్న టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంగతి ఇలా వుంటే, రచయిత వక్కంతం వంశీ-స్టయిలిష్ స్టార్ బన్నీల కాంబినేషన్ లో ఓ సినిమా ప్రారంభమవుతోంది. ఈ సినిమాలో హీరొ బన్నీ ది జవాన్ క్యారెక్టరేనంట.

ఇద్దరు రైటర్లు దర్శకులుగా తొలి సినిమాలను స్టార్ట్ చేయడం, అది కూడా రెండూ మెగా హీరోలతోనే కావడం, పైగా హీరోలు ఇద్దరు జవాన్లే కావడం విశేషమే. అయితే సాయి ధరమ్ తేజ జవాన్ లో హీరో మిలటరీలో వుంటాడో, వుండడో అన్నది ఇంకా తెలియడం లేదు కానీ, ఇంటికి ఒకడు వుంటాడు అనేది ట్యాగ్ లైన్. దీన్ని బట్టి చూస్తే మామూలు కథకే జవాన్ టైటిల్ పెడుతున్నారేమో అనిపిస్తుంది.

అయితే బన్నీ-వక్కంతం వంశీ కథ మాత్రం పక్కా మిలటరీ జవాన్ కథేనంట. అయితే కథ బోర్డర్ లో జరగదు. బొబ్బిలిపులి మాదిరిగా మిలటరీకి బయటే జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ తో కథ తయారుచేసాడు వక్కంతం వంశీ. ఇందులో కూడా బలమైన తండ్రిపాత్ర వుంది. మరి దానికి ఎవర్ని సెలెక్ట్ చేస్తారో చూడాలి. 

Show comments